ITC Q3 Results: ఐటీసీ లాభం రూ. 5,070 కోట్లు.. ఒక్కో షేరుపై ₹6 డివిడెండ్‌

ప్రముఖ ఎఫ్ఎంజీసీ (FMCG) సంస్థ ఐటీసీ (ITC) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్లో 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒక్కో షేరుపై రూ.6 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది.

Published : 03 Feb 2023 20:17 IST

దిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంజీసీ (FMCG) సంస్థ ఐటీసీ (ITC) మూడో త్రైమాసిక ఫలితాలను (Q3 Results) శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 23.09 శాతం వృద్ధితో రూ.5,070.09 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తన ఫైలింగ్‌లో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,118.80 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసుకున్నట్ల ఐటీసీ పేర్కొంది.

ఇక ఆదాయం విషయానికొస్తే 3.56 శాతం పెరిగినట్లు తెలిపింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆదాయం రూ.19,020.65 కోట్ల నమోదుచేయగా.. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.18,365.80 కోట్లను నమోదు చేసినట్లు ఐటీసీ వెల్లడించింది. ఖర్చులు మాత్రం 3.29 శాతం తగ్గినట్లు ప్రకటించింది. గతేడాది (2021) డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఖర్చులు రూ.13,207.28 కోట్లుగా నమోదవ్వగా.. 2022 ఆర్థిక సంవత్సరం అదే త్రైమాసికంలో రూ.12,772.27 కోట్లకు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. ఒక్కో షేరుపై రూ.6 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో ఐటీసీ షేరు ధర 0.50 శాతం పెరిగి రూ.380.50 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని