Itel: రూ.10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌.. 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ

Itel: చైనాకు చెందిన ఐటెల్ తాజాగా భారత్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో ఒకటి 5జీ ఫోన్‌. ఇది రూ.10వేలకే లభిస్తుండడం విశేషం.

Updated : 27 Sep 2023 12:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన ఐటెల్‌ (Itel) కంపెనీ తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. తాజాగా భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రూ.10 వేల ధరలో ఒక 5జీ ఫోన్‌ను తీసుకురావడం విశేషం. అలాగే రూ.15 వేల్లోపే కర్వ్‌డ్‌ స్క్రీన్‌ ఫోన్‌నూ ప్రవేశపెట్టింది.

5జీ పీ55.. ధర ఫీచర్లు (Itel P55 Price, specifications)..

ఐటెల్‌ తాజాగా తీసుకొచ్చిన 5జీ ఫోన్‌ పీ55 (Itel P55). దీని ధర రూ.9,999. ఇది కేవలం 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. అక్టోబర్‌ 4 నుంచి ఈ ఫోన్‌ అమెజాన్‌లో విక్రయానికి రానుంది. ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల హెడ్‌డీ+ తెరను అమర్చారు. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. స్టోరేజ్‌ను 256GB వరకు విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ను ఇస్తున్నారు.

ఐటెల్‌ పీ55 (Itel P55)లో 50MP ప్రధాన కెమెరా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరాను ఇస్తున్నారు. 18వాట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్‌ 5.1, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి, 3.5 ఎంఎం వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

కర్వ్‌డ్‌ తెరతో ఐటెల్‌ ఎస్‌23+ (Itel S23+ Price, specifications)..

తాజాగా ఐటెల్‌ తీసుకొచ్చిన మరో ఫోన్‌ ఎస్‌23+ (Itel S23+). దీని ధర రూ.13,999. దీంట్లో 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ మాత్రమే ఉంది. ఎలిమెంటల్‌ బ్లూ, లేక్‌ సియాన్‌ రంగుల్లో ఇది లభించనుంది. గత నెల ఈ ఫోన్‌ కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే విడుదలైంది. తాజాగా భారత విపణిలోకి ప్రవేశించింది.

ఐటెల్‌ ఎస్‌23+ (Itel S23+)లో 6.78 అంగుళాల అమోలెడ్‌ కర్వ్‌డ్‌ ఎఫ్‌హెచ్‌డీ+ తెరను అమర్చారు. దీనికి గొరిల్లా గ్లాస్‌ 5 రక్షణ కూడా ఉంది. ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్‌, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ను కూడా ఇచ్చారు. 12ఎన్‌ఎం Unisoc T616 ప్రాసెసర్‌ను పొందుపర్చారు. ఏఐ ఆధారిత డ్యుయల్‌ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. వెనుకభాగంలో 50MP ప్రధాన కెమెరా.. ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరాను అమర్చారు. వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 18వాట్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని