ixigo Listing: ఇక్సిగో లిస్టింగ్‌.. ఒక్కో లాట్‌పై రూ.6,762 లాభం

ixigo Listing: ఇక్సిగో ఐపీఓ (ixigo IPO) జూన్‌ 10న ప్రారంభమై 12న ముగిసింది. షేర్లు ఈరోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి.

Published : 18 Jun 2024 14:18 IST

ixigo Listing | ముంబయి: లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ షేర్లు మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.93తో పోలిస్తే దాదాపు 48 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. ఈ స్టాక్‌ బీఎస్‌ఈలో 45.16 శాతం లాభంతో రూ.135 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 48.49 శాతం ప్రీమియంతో రూ.138.10 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. లిస్టింగ్‌ (ixigo Listing) దగ్గర కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5,581.22 కోట్లుగా నమోదైంది.

ఇక్సిగో పేరిట ఆన్‌లైన్‌ ట్రావెల్‌ బుకింగ్‌ వేదికను నిర్వహిస్తున్న లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ఐపీఓ (ixigo IPO) జూన్‌ 10న ప్రారంభమై 12న ముగియనుంది. దీని ధరల శ్రేణిని కంపెనీ రూ.88-93గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.740 కోట్లు సమీకరించే లక్ష్యంతో వచ్చింది. ఈ ఐపీఓకి 98.10 రెట్ల స్పందన లభించింది. ఐపీఓలో షేర్లు అలాట్‌ అయినవారు కనీసం రూ.14,973 పెట్టుబడిగా పెట్టారు. లిస్టింగ్‌లో అది రూ.21,735కు పెరిగింది. అంటే ఒక్కో లాట్‌పై మదుపర్లు రూ.6,762 ఆర్జించారు.

గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్సిగో తాజా ఐపీఓలో (IPO) రూ.120 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను విక్రయించింది. మరో 6.66 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంచుతోంది. సమీకరించిన నిధుల నుంచి రూ.45 కోట్లు నిర్వహణ మూలధన అవసరాల కోసం కేటాయించనుంది. డేటా సైన్స్‌, క్లౌడ్‌, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతలను సమకూర్చుకోవడానికి రూ.26 కోట్లు వాడుకోనుంది. మరికొన్ని నిధులను కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించుకోనుంది.

లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీని ఆలోక్‌ బాజ్‌పాయ్‌, రజినీశ్‌ కుమార్‌ 2007లో ఏర్పాటుచేశారు. దేశంలో ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ అగ్రిగేటర్‌గా కొనసాగుతోంది. రైలు, బస్సు, విమాన టికెట్లు సహా హోటల్‌ బుకింగ్‌లకు ఇక్సిగో ప్రధాన వేదికగా ఉంది. కంపెనీ ఆదాయం 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.517 కోట్లుగా నమోదైంది. లాభం రూ.23.4 కోట్లుగా నివేదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని