Tata Motors: టాటా మోటార్స్ చేతికి ఫోర్డ్‌ ప్లాంట్‌..!

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటామోటార్స్‌ గుజరాత్‌లోని సనంద్‌లో ఫోర్డుకు చెందిన తయారీ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ డీల్‌ విలువ రూ.726 కోట్లు. డిమాండ్‌కు తగినట్లు కార్ల ఉత్పత్తిని పెంచడంపై టాటా మోటార్స్‌ దృష్టిపెట్టడంతో

Published : 08 Aug 2022 16:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటామోటార్స్‌ గుజరాత్‌లోని సనంద్‌లో ఫోర్డుకు చెందిన తయారీ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ డీల్‌ విలువ రూ.726 కోట్లు. డిమాండ్‌కు తగినట్లు కార్ల ఉత్పత్తిని పెంచడంపై టాటా మోటార్స్‌ దృష్టిపెట్టడంతో ఈ డీల్‌ ముందుకొచ్చింది. టాటా పాసింజర్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌, ఫోర్డు ఇండియా విభాగానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భూమి, యంత్రాలతో పాటు అర్హులైన ఉద్యోగులు టాటా పరిధిలోకి వెళ్లనున్నారు. 

భారత్‌లో దాదాపు 20 ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఫోర్డు మోటార్స్‌ గతేడాది ఉత్పత్తిని నిలిపివేసింది. ‘‘ప్రస్తుతం మా ప్లాంట్లు పూర్తి స్థాయి ఉత్పత్తికి దగ్గర్లో ఉన్నాయి. ఈ సమయంలో జరిగిన ప్లాంట్‌ కొనుగోలు ఉభయులకు లాభదాయకంగా ఉంటుంది’’ అని టాటా మోటార్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. సనంద్‌ ప్లాంట్లో మొదట్లో 3,00,000 వాహనాల వార్షికోత్పత్తి జరుగుతుంది. ఆ తర్వాత ఈ సామర్థ్యాన్ని 4,20,000 లక్షలకు చేర్చవచ్చు. 

మరో వైపు ఫోర్డ్స్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ స్టీవ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ స్పందిస్తూ.. భారత్‌లో ఫోర్డు వ్యాపార పునర్‌ వ్యవస్థీకరణలో దీనిని కీలక ముందడుగుగా అభివర్ణించారు.  గతేడాది సెప్టెంబర్‌లో ఫోర్డు తన ఫ్యాక్టరీలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో 4,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని పేర్కొంది. భారత్‌లో గత పదేళ్లలో ఫోర్డుకు 2 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. ఫోర్డుకు ఉన్న అతిపెద్ద మార్కెట్లో భారత్‌ కూడా ఒకటి కావాలన్న కంపెనీ కల సాకారం కాలేదు. మరో వైపు భారత్‌లో దేశీయ కంపెనీలైన టాటా, మహీంద్రాలు మంచి అమ్మకాలను అందుకొన్నాయి. ఇటీవల ఉత్పత్తిని మించి డిమాండ్‌ లభిస్తోందని ఇటీవల మహీంద్రా అండ్‌ మహీంద్రా పేర్కొంది. 
 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని