JBL: స్మార్ట్‌ ఛార్జింగ్‌ కేస్‌తో జేబీఎల్‌ ఇయర్‌బడ్స్‌.. ధర ఎంతంటే?

JBL Live Beam 3: టచ్‌ స్క్రీన్‌ కలిగిన ఛార్జింగ్‌ కేస్‌తో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ జేబీఎల్‌ కొత్త ఇయర్‌బడ్స్‌ను భారత్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Published : 19 Jun 2024 00:11 IST

JBL Live Beam 3 | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ జేబీఎల్‌ (JBL) కొత్త తరహా ఇయర్‌బడ్స్‌ను భారత్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. జేబీఎల్‌ లైవ్‌ బీమ్‌ 3 (JBL Live Beam 3) పేరిట ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను (TWS earbuds) తీసుకొచ్చింది. ఈ ఇయర్‌బడ్స్‌ ధర రూ.13,999. బ్లాక్‌, బ్లూ, సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. 1.45 అంగుళాల టచ్ స్క్రీన్‌ సదుపాయంతో స్మార్ట్‌కేస్‌తో దీన్ని తీసుకొచ్చింది. స్క్రీన్‌ సాయంతో వాల్యూమ్, ఈక్విలైజర్‌ను నియంత్రించొచ్చు. మెసేజ్‌లు చూడొచ్చు. ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేయొచ్చు. జేబీఎల్‌ వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు.

భారత్‌కు గూగుల్‌ జెమిని యాప్‌.. తెలుగుతో సహా 9 భాషల్లో అందుబాటులోకి!

ఇయర్‌బడ్స్‌లో 10mm డైనమిక్ డ్రైవర్లు అమర్చారు. ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు మెరుగైన పనితీరు కోసం ఆరు మైక్రోఫోన్‌లను ఉపయోగించి ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్‌ చేస్తుంది. స్మార్ట్ యాంబియంట్ సౌండ్ మోడ్‌, స్పేషియల్ సౌండ్ టెక్నాలజీకి కూడా సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఒక్కో ఇయర్‌బడ్‌ 68mAh బ్యాటరీతో వస్తోంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 12 గంటలపాటు ప్లేబ్యాక్‌ లైఫ్‌ ఉంటుంది. ఛార్జింగ్‌ కేస్‌ 36 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. మొత్తం 48 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ కలిగి ఉంటుంది. స్మార్ట్‌ కేస్‌ను వైర్‌లెస్‌గా ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని