Jeff Bezos: ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో జెఫ్ బెజోస్ నిశ్చితార్థం!
Jeff Bezos: త్వరలోనే జెఫ్ బెజెస్, ఆయన ప్రియురాలు లారెన్ శాంచెజ్ వివాహం చేసుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో వీరివురు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నట్లు తాజాగా తెలుస్తోంది.
వాషింగ్టన్: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos ) ఆయన ప్రియురాలు లారెన్ శాంచెజ్ (Lauren Sanchez)తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వీరివురు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. లారెన్ (Lauren Sanchez) ఇటీవల హృదయాకారంలో ఉన్న చేతి ఉంగరాన్ని ధరించడం ప్రారంభించినప్పటి నుంచి ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
లారెన్ (Lauren Sanchez) గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బెజోస్ (Jeff Bezos), లారెన్ 2018 నుంచే డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే, 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరివురికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు లారెన్ (Lauren Sanchez), బెజోస్.. తమ మధ్య బంధాన్ని బయటకు అధికారికంగా వెల్లడించలేదు.
బెజోస్ (Jeff Bezos) నుంచి మెకంజీ 38 బిలియన్ డాలర్లు భరణంగా పొందారు. దీంట్లో సగం దాతృత్వ కార్యక్రమాల కోసం వితరణ చేశారు. మరోవైపు లారెన్ (Lauren Sanchez)కు గతంలో పాట్రిక్ వైట్‌సెల్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరివురికి ఇద్దరు పిల్లలున్నారు. మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్ ఆటగాడు టోనీ గోంజలెజ్‌తోనూ ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్