
Amazon Jeff Bezos: గంటల్లో ₹1.56 లక్షల కోట్లు కోల్పోయిన బెజోస్
వాషింగ్టన్: అమెజాన్ (Amazon) అధినేత జెఫ్ బెజోస్ (Jeff Bezos) సంపద కొన్ని గంటల వ్యవధిలో 20.5 బిలియన్ డాలర్లు (రూ.1.56 లక్షల కోట్లు) కరిగిపోయింది. శుక్రవారం కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవిచూడడమే ఇందుకు కారణం. అమెజాన్ (Amazon) షేరు నిన్న 14.05 శాతం పడిపోయి 2,485.63 డాలర్ల వద్ద స్థిరపడింది.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమెజాన్ ఫలితాలు (Amazon Results) మదుపర్లను నిరాశపర్చాయి. 2015 తర్వాత కంపెనీ తొలిసారి నష్టాల్ని నమోదు చేసింది. అలాగే 21 ఏళ్ల తర్వాత తొలిసారి విక్రయాల వృద్ధి నెమ్మదించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కంపెనీ షేర్లు శుక్రవారం భారీ పతనాన్ని చవిచూశాయి.
2022లో 43 బి.డాలర్లు ఆవిరి..
జెఫ్ బెజోస్‌కు అమెజాన్‌లో 11.1 శాతం వాటాలున్నాయి. ఆయన వ్యక్తిగత సంపదలో అధిక వాటా అమెజాన్ (Amazon) షేర్లదే. అమెరికాలో నిన్న మార్కెట్లు ముగిసే సమయానికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ సంపద 148 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తంగా ఆయన శుక్రవారం ఒక్కరోజే తన సందపలో 12 శాతం పతనాన్ని చవిచూశారు. నిన్నటి నష్టాలతో కలుపుకొని 2022లో ఇప్పటి వరకు బెజోస్ (Jeff Bezos) సంపద 43 బిలియన్ డాలర్ల మేర తరిగిపోయింది. అయినప్పటికీ.. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 249 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ తొలిస్థానంలో ఉన్నారు. బెజోస్ ఎదుర్కొన్న నష్టాలు కేవలం కాగితానికే పరిమితం. ఒకవేళ అమెజాన్ షేర్లు మళ్లీ పుంజుకుంటే.. ఆయన సంపద తిరిగి పెరుగుతుంది. అమెజాన్ (Amazon) షేర్ల పతనంతో శుక్రవారం అమెరికా ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన నాస్డాక్ సూచీ సైతం భారీగా దిగజారింది.
అమెజాన్ నష్టాలకు కారణాలివే..
మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను అమెజాన్ గురువారం ప్రకటించింది. 3.84 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 8.1 బిలియన్ డాలర్ల లాభాల్ని నివేదించింది. రివియాన్ మోటివ్ స్టాక్స్‌లో అమెజాన్ పెట్టిన పెట్టుబడి 7.6 బిలియన్ డాలర్ల నష్టాలకు కారణమైంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఈ-కామర్స్ (E-Commerce) వ్యాపారంలో 1.28 బిలియన్ డాలర్ల ఆపరేటింగ్ నష్టాల్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే నికరంగా మార్చి త్రైమాసికంలో అమెజాన్ నష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
కొవిడ్ సమయంలో ఈ-కామర్స్ (E-commerce) వ్యాపారం భారీగా పుంజుకున్న విషయం తెలిసిందే. దీంతో అమెజాన్ (Amazon) డిమాండ్‌కు అనుగుణంగా తమ కార్యకలాపాల్ని విస్తరించింది. కొత్త గిడ్డంగులను, స్టోర్లను నిర్మించింది. భారీ వేతనాలతో ఉద్యోగులను ఆకర్షించింది. క్రమంగా సాధారణ కార్యకలాపాలు పుంజుకుంటుండడంతో ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌ను తగ్గించారు. దీంతో అమెజాన్ వ్యాపారం నెమ్మదించింది. పైగా అధిక వేతనాలు, గిడ్డంగుల నిర్వహణ భారీ వ్యయంతో కూడిన వ్యవహారంగా మారింది. మరోవైపు ఇంధన ధరలు పెరగడంతో రవాణా వ్యయం సైతం భారంగా పరిణమించింది. అలాగే ద్రవ్యోల్బణం (Inflation) పెరగడంతో ఖర్చులు రెండు బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు అమెజాన్ ఇటీవల వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
arshdeep: ఉమ్రాన్ ఓకే.. మరి అర్ష్‌దీప్ సంగతేంటి?
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు విశేష స్పందన.. 4 రోజుల్లో 94వేల మంది దరఖాస్తు
-
General News
Andhra news: ‘అమ్మఒడి’లో మరో కుదింపు.. ల్యాప్‌టాప్‌కు బదులు ట్యాబ్‌లు!
-
General News
Telangana news: కలుషిత ఆహారం తిని 128మంది బాలికలకు అస్వస్థత
-
Politics News
Telangana news: ప్రశ్నిస్తే.. రైతులపై కేసులు పెట్టి బేడీలు వేస్తున్నారు: రేవంత్
-
Movies News
Social Look: ప్రియాంక చోప్రా ముద్దూ ముచ్చట్లు.. చీరలో మెరిసిన ముద్దుగుమ్మలు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Russia: 104 ఏళ్ల తర్వాత తొలిసారి రుణ చెల్లింపులో రష్యా విఫలం ..!