Jeff Bezos - Daily Routine: రోజులో ఆ టైమ్‌ నాకు ఇంపార్టెంట్‌: దినచర్య గురించి జెఫ్‌ బెజోస్‌ ఏం చెప్పారంటే?

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ (Jeff Bezos) తన దినచర్యను ఎలా ప్రారంభిస్తారో వెల్లడించారు. ఉదయం ఏమేమీ చేస్తారో చెప్పారు.

Updated : 02 Jul 2024 14:45 IST

వాషింగ్టన్‌: అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) తన టైమ్‌ను ఎలా మేనేజ్ చేస్తున్నారు? వివిధ వ్యాపారాలను చూసుకుంటున్న ఆయనకు నిద్ర పోవడానికి సమయం ఉంటుందా? అని ఒక్కోసారి అనిపిస్తుంటుంది కదా! దీనికి ఆన్సర్‌ దొరికింది. తన దినచర్య గురించి బెజోస్‌ చెప్పిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయం లేవగానే ఆయన ఏం చేస్తారు, రోజును ఎలా ప్లాన్‌ చేసుకుంటారనే విషయాలు ఆ వీడియోలో ఉన్నాయి.

అదానీ హిండెన్‌బర్గ్‌ వివాదంలో కొత్త మలుపు.. మధ్యలో కోటక్ బ్యాంకు ప్రస్తావన!

నేను తొందరగా నిద్రపోతాను. అంతే తర్వగా నిద్రలేస్తా. నా మనసుకు నచ్చిన పనులు చేస్తుంటా. ఉదయం వార్తా పత్రిక చదవడమంటే ఇష్టం. కాఫీని ఆస్వాదిస్తా. నా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందే వారితో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుంటా. ఈ పనులన్నీ నాకెంతో ముఖ్యం. వీటన్నింటి తర్వాత రోజులో నా తొలి సమావేశాన్ని 10 గంటలకల్లా ప్రారంభిస్తా. ముఖ్యమైన సమావేశాలన్నీ లంచ్‌కు ముందే పూర్తయ్యేలా చూస్తాను. మళ్లీ ఏవైనా ముఖ్యమైన సమావేశాలు ఉంటే.. వాటిని మరుసటి రోజు ఉదయం ఉండేలా చూసుకుంటాను. సాయంత్రం ఐదు గంటల సమయంలో నేను అంతగా ఎఫర్ట్‌ పెట్టలేను

- జెఫ్‌ బెజోస్ 

రోజుకు ఎనిమిది గంటల నిద్ర మంచిదనే అభిప్రాయాన్ని బెజోస్‌ వ్యక్తం చేశారు. ఆయన దినచర్చ విషయంలో నెటిజన్లు తమ ఆలోచనలను కామెంట్ల రూపంలో వెల్లడించారు. ఉదయం త్వరగా లేవడం వల్ల పొద్దున్నే హడావుడి లేకుండా పనులు చేసుకోవచ్చని, దాంతో రోజులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండొచ్చన్నారు. ఉదయం పూట మంచి ఆలోచనలకు అవకాశం ఉంటుందని మరికొందరు కామెంట్లు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని