Jeff Bezos: అందుకోసం నా సంపదలో పెద్ద మొత్తాన్ని కేటాయిస్తా: జెఫ్‌ బెజోస్‌

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సంపదలోంచి పెద్ద మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Published : 14 Nov 2022 22:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సంపదలోంచి పెద్ద మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ మొత్తాన్ని ఆయన ఎప్పుడు? ఎలా? ఎవరికి ఇస్తారనేది మాత్రం ఇంకా స్పష్టంచేయలేదు. తన స్నేహితురాలు లారెన్‌ శాన్‌షెజ్‌తో కలిసి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌ తరహాలో గివింగ్ ప్లెడ్జ్‌ (సంపదను దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించండం)లో బెజోస్‌ పాల్గొనడం లేదంటూ గతంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.  ఈనేపథ్యంలో తొలిసారి బెజోస్ దాతృత్వం గురించి ప్రకటన చేయడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.  

ప్రస్తుతం బెజోస్ సంపద 124 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 10 లక్షల కోట్లు)గా అంచనా. ఇందులోంచి ఆయన ఎంత మొత్తం విరాళంగా ఇస్తారనేది ఇంకా వెల్లడించలేదు. ‘‘ ఈ ప్రక్రియలో సంపదను ఎలా ఖర్చు చేయాలనేదే  అత్యంత కష్టమైన పని. అమెజాన్‌ను నిర్మాణం సులువుగా జరగలేదు. దాని వెనుక ఎంతో మంది తెలివైన వ్యక్తుల కృషి ఉంది. లారెన్‌, నేను కలిసి ఈ  సంపదను ఖర్చు పెట్టేందుకు సరైన మార్గం కోసం వెతుకుతున్నాం’’ అని తెలిపారు. గతేడాది బెజోస్‌ అమెజాన్‌ సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగారు. తర్వాత బెజోస్‌ ఎర్త్‌ ఫండ్‌ ద్వారా 10 బిలియన్‌ డాలర్లతో పర్యావరణ పరిరక్షణకు కృష్టి చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే గతేడాది సమారు 510 మిలియన్‌ డాలర్లు దాతృత్వ కార్యక్రమాలకు ఉపయోగించినట్లు సమాచారం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts