Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్ సీఈఓగా సంజీవ్‌ కపూర్‌

ఏప్రిల్‌ నుంచి కార్యకలాపాల్ని పునఃప్రారంభించనున్న ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కీలక నిర్ణయం తీసుకుంది....

Updated : 04 Mar 2022 14:14 IST

దిల్లీ: ఏప్రిల్‌ నుంచి కార్యకలాపాల్ని పునఃప్రారంభించనున్న ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సంజీవ్‌ కపూర్‌ను సీఈఓగా నియమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భారత వాయుసేనలో పనిచేసిన కెప్టెన్‌ పీపీ సింగ్‌ను కంపెనీ ఇటీవలే అకౌంటబుల్‌ ఆఫీసర్‌గా నియమించింది. అలాగే శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విపుల గుణతిలకను సీఎఫ్‌ఓగా నియమిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది.

విమానయాన రంగంలో సంజీవ్‌ కపూర్‌కు దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆసియా, ఐరోపా, అమెరికాలోని పలు కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఒబెరాయ్ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. స్పైస్‌జెట్‌, గోఎయిర్‌, విస్తారాలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం కపూర్‌ సొంతం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని