Jet Airways: త్వరలో ఎగరనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌ను బిడ్డింగ్‌లో దక్కించుకున్న కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్టియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కొన్ని షరతులతో ఆమోదం తెలిపింది. ఈ విమానయాన సంస్థ పునరుద్ధరణ ప్రక్రియలో....

Updated : 22 Jun 2021 16:40 IST

కల్‌రాక్‌-జలాన్‌ రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

దిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ను బిడ్డింగ్‌లో దక్కించుకున్న కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కొన్ని షరతులతో ఆమోదం తెలిపింది. ఈ విమానయాన సంస్థ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా విమానాశ్రయాల్లో స్లాట్ల కేటాయింపునకు పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ)కు ఎన్‌సీఎల్‌టీ 90 రోజుల గడువు ఇచ్చింది.

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ఉద్యోగులకు జెట్‌ ఎయిర్‌వేస్ చెల్లించాల్సిన రూ.12,000 కోట్లను రానున్న ఐదేళ్లలో చెల్లిస్తామని రుణ పరిష్కార ప్రక్రియలో కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం ప్రతిపాదించింది. జెట్‌ కార్యకలాపాలను 30 విమానాలతో తిరిగి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

రుణ ఊబిలో కూరుకుపోవడంతో 2019 ఏప్రిల్‌లో మూతపడిన జెట్‌ ఎయిర్‌వేస్‌, ప్రస్తుతం దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబరులో బ్రిటన్‌కు చెందిన కల్‌రాక్‌ క్యాపిటల్‌, యూఏఈ వ్యాపారవేత్త జలాన్‌ల నేతృత్వంలోని కన్సార్టియం.. జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. అనంతరం సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాతల కమిటీ (సీఓసీ) ఆమోదం తెలిపింది. తుది అనుమతి కోసం ఎన్‌సీఎల్‌టీ వద్దకు చేరిన ప్రణాళికకు.. తాజాగా అక్కడ కూడా ఆమోదం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని