దసరాకీ.. దీపావళికీ.. మీరు మెచ్చే.. కాంతులీనే ఆభరణాలివి!

ఈ దీపావళి పండగ వేళ అలాంటి మెరుపులు మెరిపించే అద్భుతమైన జువెలరీ కలెక్షన్‌ను అందిస్తోంది తనిష్క్‌.

Updated : 20 Sep 2022 09:10 IST

(ప్రకటన)

పండగంటేనే ఉత్తేజకరమైన వాతావరణంలో సంతోషాల మేళవింపుతో నలుగురితో ఆనందంగా జరుపుకొనే వేడుక. ముఖ్యంగా మన భారతీయ పండగ సంబరాల్లో నగలు ప్రముఖంగా కనిపిస్తాయి. భారత చరిత్ర, సంస్కృతి, వారసత్వం ఆభరణాలతో ముడిపడి ఉండడమే ఇందుకు కారణం.

ఆ వారసత్వాన్ని కొనసాగించేలా.. ఈ పండగ వేళ రాజ వైభవం ఉట్టిపడేలా కనిపించాలంటే భారతీయ కళారూపాలకు అద్దంపట్టే నగలు ధరించాల్సిందే. ఓ కళాకారుడి చేతి నుంచి జాలువారే ఓ కళాఖండంలా మారాలన్నా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేందుకు ఓ గొప్ప చిత్రం మీకు కావాలన్నా వీటిపై ఓ లుక్కేయాల్సిందే. ఈ దీపావళి పండగ వేళ అలాంటి మెరుపులు మెరిపించే అద్భుతమైన జువెలరీ కలెక్షన్‌ను అందిస్తోంది తనిష్క్‌.

రాచరిక వారసత్వాన్ని ఇష్టపడే వారు.. ఓ రాణిగా ఠీవిగా కనిపించాలని భావించేవారికి ఇవి సరిగ్గా సరిపోతాయి. ఈ పండగ సీజన్‌లో మీ వస్త్రధారణకు ఇవి తోడైతే మీకు ఓ రాయల్‌ లుక్‌ను తీసుకొస్తాయి. వెలుగుజిలుగులీనే ఈ ఆభరణాలు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మెరిసే పోల్కీతో కూడిన డిజైన్‌లు ఈ దీపావళికి మీ అప్పీల్‌ను మరింత పెంచుతాయి. సంప్రదాయ దుస్తులు లేదా అధునాతన ఇండో-వెస్ట్రన్ దుస్తులతో ఈ అందమైన వారసత్వ నెక్‌పీస్‌ను కలిపి ధరిస్తే లుక్‌ అదిరిపోతుంది.


లేత రంగులు మన దేహానికి కొత్త రూపునిస్తాయి. అవే రంగులు ఆభరణాలకూ పునరుజ్జీవనాన్ని కలిగిస్తాయి. బ్లష్ పింక్‌లు, క్రీమ్‌లు, మింటీ గ్రీన్స్, క్యాండీ కలర్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. ముఖ్యంగా లేలేత రంగు ఆభరణాలు చూసే వారికి నచ్చడమే కాదు.. ధరించే వారిలోనూ ఓ పాజిటివ్‌ వైబ్‌ను క్రియేట్‌ చేస్తాయి. కొత్త ప్యాలెట్‌లోని ఈ అందమైన పీసెస్‌ పండగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. బ్రంచ్ పార్టీలు లేదా సాయంత్రం వేళ జరిగే కాక్టెయిల్స్ పార్టీల్లో ఈ ఆభరణాలు ధరించి మెరుపులు మెరిపించొచ్చు.


ఉత్సాహభరితమైన పండగ దుస్తులకు సరిపోయేలా రంగులతో కూడిన నగల కోసం వెతుకుతుంటే.. పూతపూసిన నెక్‌పీస్‌లు మీకు సరిగ్గా సరిపోతాయి. ఇవి రాయల్ లుక్‌నిస్తాయి. నీలం, గులాబీ వంటి విభిన్న రంగులు.. పూల డిజైన్లలో జీవకళ ఉట్టిపడేలా చేస్తాయి. గ్లాస్, పెయింటింగ్, చటై వంటి ఎనామెల్ టెక్నిక్‌లు డిజైన్‌లకు క్లాసిక్‌ టచ్‌ను ఇస్తాయి. ఈ పండగ సీజన్‌కు తప్పకుండా ఎంపిక చేయాల్సిన ఆభరణంగా ఇది నిలుస్తుంది.


ముత్యాలకున్న ఆదరణ ఇప్పటికీ, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. వాటికుండే విలువ అలాంటిది. ఈ కోవలోకే వస్తుంది పెర్ల్‌ పిరోయ్‌. రాయల్‌ లుక్‌ను కలిగి ఉంటూనే రంగు రాళ్లు, దీనికి ఉండే పూత, ఇతర ఆధునిక నవీకరణలు.. మిమ్మల్ని స్టైల్‌గా ఉంచడంలో ప్రముఖంగా నిలుస్తుంది. ముత్యాలు ఎల్లప్పుడూ స్త్రీలకు కొత్త అందాన్ని ఇస్తాయి.


రుతుపవనాల సీజన్‌ ముగుస్తోంది. శీతాకాలం తలుపులు తట్టడానికి సిద్ధమవుతోంది. పూల ఆకృతుల అందాలను ఆస్వాదించడానికి, శరదృతువును సాదరంగా ఆహ్వానించడానికి ఈ పండగ సీజన్ సరైన సమయం. ప్రకృతి సౌందర్యం ఎప్పుడూ పూలలోనే  ఉట్టిపడుతుంది. ఈ పండగ వేళ మీరు ఎంచుకున్న ఏదైనా దుస్తులకు అలాంటి పూల అందాలు తోడైతే నలుగురిలో మీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. నీలం, గులాబీ రంగుల మేళవింపుతో ఉండే వికసించే కమలం రూపంలో ఉండే పూల డిజైన్లు జీవకళను కలిగి ఉంటాయి. అంతేకాదు ఈ పూల డిజైన్లు అటు భారతీయ సంప్రదాయ వస్త్రధారణతో పాటు, సమకాలీన వస్త్రధారణకు ఇట్టే నప్పుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని