TRAI data: జియోకు జై కొడుతున్నారు.. ఆ నెట్‌వర్క్‌ను ‘VI’డిచిపోతున్నారు..!

Jio adds over 31 lakh mobile users in May: దిల్లీ: కొత్త యూజర్లను చేర్చుకోవడంలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో (JIO) మరోసారి ముందు వరుసలో నిలిచింది.

Published : 19 Jul 2022 18:59 IST

Jio adds over 31 lakh mobile users in May: దిల్లీ: కొత్త యూజర్లను చేర్చుకోవడంలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో (JIO) మరోసారి ముందు వరుసలో నిలిచింది. మే నెలలో కొత్తగా 31 లక్షల మంది యూజర్లను ఆ కంపెనీ ఆకట్టుకుంది. అదే సమయంలో వొడాఫోన్‌ (VI) నెట్‌వర్క్‌ మరోసారి సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. కొత్తగా 7.5 లక్షల మంది ఆ నెట్‌వర్క్‌ను విడిచి బయటకొచ్చారు. మే నెలకు సంబంధించి ట్రాయ్‌ (TRAI) వెలువరించిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.

మే నెలలో జియో నెట్‌వర్క్‌ను కొత్తగా 31 లక్షల మంది ఎంచుకోవడంతో కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరిందని ట్రాయ్‌ తెలిపింది. సునీల్‌ మిత్తల్‌ నేతృత్వంలోని ఎయిర్‌టెల్‌లో కొత్తగా 10.27 లక్షల మంది చేరారు. దీంతో కంపెనీ మొత్తం యూజర్ల సంఖ్య 36.21 కోట్లకు చేరింది. వొడాఫోన్‌ను 7.59 లక్షల మంది విడిచి వెళ్లిపోవడంతో యూజర్ల సంఖ్య 25.84 కోట్లకు చేరింది. టెలికాం రంగంలో 35.69 శాతం మార్కెట్‌ వాటాతో జియో అగ్రస్థానంలో ఉండగా.. ఎయిర్‌టెల్‌ 31.62 శాతం, వొడాఫోన్‌ ఐడియా 22.56 శాతం మార్కెట్‌ వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

దేశంలో మొత్తం వైర్‌లెస్‌ యూజర్ల సంఖ్య 115 కోట్లకు చేరిందని ట్రాయ్‌ తెలిపింది. అర్బన్‌ ఏరియాల్లో కొత్త సబ్‌స్క్రైబర్ల సంఖ్య 0.12 శాతం మేర పెరిగి 62.45 కోట్లకు చేరగా.. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త చందాదారుల సంఖ్య 0.4 శాతం మేర పెరిగి 52.09 కోట్లకు పెరిగింది. మే నెలలో మొత్తం 79 లక్షల మంది మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీకి రిక్వెస్ట్‌ పెట్టుకున్నట్లు ట్రాయ్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని