Jio New plans: క్రికెట్ అభిమానుల కోసం జియో కొత్త ప్లాన్లు
ఇంటర్నెట్‌డెస్క్: క్రికెట్ ప్రియుల కోసం జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. 55 రోజుల కాలపరిమితితో కూడిన ఈ ప్లాన్ ధర ₹555గా నిర్ణయించింది. ఈ డేటా యాడ్ఆన్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లు 55 జీబీ డేటా, ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు అన్ని జియో యాప్‌ల సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందుతారు. అయితే ఇందులో వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ సేవలు ఉండవు.
ఈ ప్లాన్‌తో పాటు జియో ₹2,999 కూడిన మరో ప్లాన్‌ను కూడా ప్రకటించింది. దీని కాలపరిమితి 365 రోజులు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లు రోజుకు 2.5జీబీ డేటా, అపరిమిత వాయిస్‌కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, అన్ని జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు.
ప్రస్తుతం టీ20 లీగ్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జియో తెలిపింది. వినియోగదారులు మైజియో యాప్ లేదా జియో వెబ్‌సైట్‌తోపాటు వివిధ థర్డ్‌పార్టీ యాప్‌లు, వెబ్సైట్ల నుంచి కూడా రీఛార్జ్ చేసుకోచ్చు. ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకున్న తర్వాత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ కోసం కూపన్ కోడ్ వస్తుంది. దానితో డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్సైట్లోకి వెళ్లి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
ఇవే కాకుండా క్రికెట్ అభిమానుల కోసం జియో ₹499 (28 రోజులు/2జీబీ డేటా రోజుకు), ₹601 (28 రోజులు/ 3జీబీ డేటా రోజుకు), ₹799 (56 రోజులు/2జీబీ డేటా రోజుకు), ₹1,066 (84 రోజులు/2జీబీ డేటా రోజుకు), ₹1,499 (84 రోజులు/2జీబీ డేటా రోజుకు), ₹3,119 (365 రోజులు/2జీబీ డేటా రోజుకు), ₹4,199 (365 రోజులు/3జీబీ డేటా రోజుకు) ప్లాన్లను అందిస్తోంది. డేటా యాడ్ఆన్ కేటగిరీలో ₹659 (58 రోజులు/1.5జీబీ డేటా) ప్లాన్ అందుబాటులో ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Pawan Kalyan: పదవి వెతుక్కుంటూ రావాలి గానీ పదవి వెంట పడకూడదు: పవన్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Beating Retreat: అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ వేడుకలు
-
General News
Telangana News: దేవేంద్రసింగ్, మహేశ్ భగవత్‌కు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్
-
Technology News
Meta: వాట్సాప్, యూట్యూబ్ యూజర్లకు ‘ఫేస్బుక్’ కీలక సూచన..!
-
India News
President of India: దేశం ఆశలన్నీ వారిపైనే.. జాతినుద్దేశించి ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Rakesh Jhunjhunwala: ఝున్‌ఝున్‌వాలాను నిలబెట్టిన స్టాక్స్ ఇవే..