Jio 5G: తెలంగాణ వ్యాప్తంగా 850 ప్రాంతాల్లో జియో 5జీ సేవలు

Jio 5g in Telangana: తెలంగాణలో జియో సేవలు మరింత విస్తృతం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 850 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Published : 05 Jun 2023 18:36 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రిలయన్స్‌ జియో తన 5జీ సేవలను (Jio 5G) అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 850కి పైగా ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలను తీసుకొచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. వినియోగదారులకు అత్యుత్తమ ట్రూ 5జీ అనుభవాన్ని అందించడం పట్ల జియో చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఓ ప్రకటనలో తెలిపింది.

జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన అన్ని ప్రాంతాల్లో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద 1 జీబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటాను వినియోగదారులు ఉచితంగా వినియోగించవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఇక్కడి కీలక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, విద్యాసంస్థలు, మాల్స్, మార్కెట్లు, నివాస ప్రాంతాలు, హాస్పిటల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర ముఖ్యమైన వాణిజ్య సంస్థల్లో జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతేగాకుండా ఈ నగరాలు, పట్టణాలకు చేరువలో ఉండే గ్రామాలు కూడా జియో5జీ కనెక్టివిటీతో లబ్ధి పొందనున్నారని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలను విస్తరించినందుకు తామెంతగానో సంతోషిస్తున్నామని జియో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి అన్నారు. 2023 డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణం, తాలూకాలో ట్రూ 5జీ సేవలను ప్రారంభించాలనే లక్ష్యంతో జియో ముందుకెళుతోందన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని