Jio: రిలయన్స్‌ ఇన్‌ఫ్రా స్వాధీనానికి జియోకు NCLT అనుమతి

రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ స్వాధీనానికి జియోకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఆర్‌కామ్‌కు చెందిన టవర్లు, ఫైబర్‌ ఆస్తులు జియో సొంతం కానున్నాయి.

Published : 21 Nov 2022 19:52 IST

ముంబయి: రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ స్వాధీనానికి జియోకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఆర్‌కామ్‌కు చెందిన టవర్లు, ఫైబర్‌ ఆస్తులు జియో సొంతం కానున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎస్క్రో అకౌంట్‌లో రూ.3,720 కోట్లు జమ చేయాలని సూచించగా.. ఆ మొత్తాన్ని ఇప్పటికే జియో జమ చేసింది.

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా దివాలా తీయడంతో ఆ కంపెనీ స్వాధీనానికి ముకేశ్‌ అంబానీ 2019 నవంబర్‌లో రూ.3,720 కోట్లతో బిడ్‌ దాఖలు చేశారు. అయితే పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలపడాన్ని సవాలు చేస్తూ కార్యనిర్వాహక రుణదాతలు కోర్టుకెళ్లారు. న్యాయమైన, సమానమైన వాటా దక్కలేదంటూ కార్యనిర్వాహక క్రెడిటర్లు కోర్టు కెళ్లడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.

ఈ క్రమంలో గత నెల జియో ఎన్‌సీఎల్‌టీ ఆశ్రయించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. ఆలస్యమయ్యేకొద్దీ ఇరువర్గాలకూ నష్టం చేకూరుతుందని, ఆస్తుల విలువ కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ క్రమంలో ఎన్‌సీఎల్‌టీ తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు చెందిన 1.78 లక్షల కిలోమీటర్ల రూట్‌లో ఫైబర్‌ ఆస్తులు, 43,540 కోట్ల టవర్లు జియో సొంతం కానున్నాయి. మరోవైపు ఎస్‌బీఐ, దోహా బ్యాంక్‌, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌, ఎమిరేట్స్‌ బ్యాంక్‌ మధ్య వాటాల పంపకాల విషయంలో ఏర్పడిన వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని