Jio 5g: 5జీ కోసం లక్ష టవర్లు ఏర్పాటు చేసిన జియో

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) దాదాపు లక్ష టెలికాం టవర్లను ఏర్పాటు చేసింది. తనకు పోటీగా ఉన్న నెట్‌వర్క్‌ కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ.

Published : 25 Mar 2023 17:38 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) తన 5జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు లక్ష టెలికాం టవర్లను ఏర్పాటు చేసింది. ప్రత్యర్థి కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా టవర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. జియో 700 MHz, 3,500 MHz ఫ్రీక్వెన్సీలో ఇప్పటికే 99,897 బేస్‌ ట్రాన్సీవర్‌ స్టేషన్‌లను (BTS) ఏర్పాటు చేసిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యునికేషన్స్‌ (DoT) వెల్లడించింది.

ఇదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) 22,219 బీటీఎస్‌లను మాత్రమే ఏర్పాటు చేసిందని డాట్‌ వెల్లడించింది. ప్రతి బేస్‌ స్టేషన్‌కి ఎయిర్‌టెల్‌ రెండు సెల్‌ సైట్స్‌ ఏర్పాటు చేయగా.. జియో మాత్రం మూడేసి సెల్‌ సైట్స్‌ ఏర్పాటు చేసిందని నివేదిక తెలిపింది. ఎయిర్‌టెల్‌ సగటున 268 Mbps వేగంతో 5జీ సేవలు అందిస్తుండగా.. జియో మాత్రం 506 Mbps వేగంతో అన్నింటికంటే ముందంజలో ఉందని  నెట్‌వర్క్‌ స్పీడ్‌ టెస్టింగ్‌ సంస్థ ఊక్లా తన నివేదికలో తెలిపింది. మరోవైపు ఈ రెండు సంస్థలు పోటా పోటీగా సేవలు విస్తరించడంపై  దృష్టి సారించాయి. ఎయిర్‌టెల్‌ 500 నగరాలకు తన 5జీ సేవలను విస్తరించగా.. జియో 400కు పైగా నగరాల్లో తన 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు