Updated : 15 Feb 2022 13:49 IST

Jio: జియో నుంచి శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దిగ్గజ టెలికం రంగ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ మరో అడుగు ముందుకేసింది. శాటిలైట్‌ అనుసంధాన సేవల సంస్థ ఎస్‌ఈఎస్‌తో జట్టుకట్టింది. ఈ రెండు కంపెనీలు ‘జియో స్పేస్‌ టెక్నాలజీస్‌’ పేరిట ఓ జాయింట్‌ వెంచర్‌ను ప్రారంభించాయి. ఈ సంస్థలో జియోకు 51శాతం, ఎస్‌ఈఎస్‌కు 49శాతం వాటాలు ఉండనున్నాయి.  ‘‘మా ఫైబర్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, ఫైబర్‌ టు ది హోం వ్యాపారం, 5జీ రంగంలో పెట్టుబడులను కొనసాగిస్తాం. మల్టీ గిగాబైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వ్యాపార వృద్ధి కోసం ఎస్‌ఈఎస్‌తో జాయింట్‌ వెంచర్‌ ప్రారంభించాం. శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌తో అదనపు కవరేజీ, సామర్థ్యం లభిస్తాయి. ఫలితంగా జియో.. మారుమూల పట్టణాలు, గ్రామాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలను, వినియోగదారులను సరికొత్త డిజిటల్‌ ఇండియాతో అనుసంధానించే అవకాశం ఉంది. శాటిలైట్‌ పరిశ్రమలో నిపుణులైన ఎస్‌ఈఎస్‌తో కలిసి సరికొత్త ప్రయాణం ప్రారంభించి వినియోగదారులకు మరింత చేరువవడంపై ఉత్సాహంగా ఉంది’’ అని జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ పేర్కొన్నారు. 

ఈ డీల్‌ ప్రకారం కొత్త సంస్థ వివిధ కక్ష్యల్లోని ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను వాడుకుంటుంది. ఫలితంగా 100 జీబీపీఎస్‌ సామర్థ్యంతో ఇంటర్నెట్‌ను అందించవచ్చు. ఈ డీల్‌లో భాగంగా జియో గేట్‌వే ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తుంది. దీనిని దేశంలో ఈ సరికొత్త సేవలు అందించేందుకు వాడుకోనుంది.




Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని