Jio New prepaid plans: డిస్నీ+ హాట్‌స్టార్‌తో జియో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌.. వివరాలివే

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Jio prepaid plans) డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ hotstar) మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన మూడు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది.

Updated : 22 Aug 2022 16:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Jio prepaid plans) డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ hotstar) మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన మూడు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటి ధరలను ₹333, ₹583, ₹783లుగా జియో పేర్కొంది. ఈ ప్లాన్లలో డిస్నీ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 1.5జీబీ డైలీ డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ వంటి సదుపాయాలు కూడా పొందొచ్చు. వీటితో పాటు రూ.151 విలువైన కొత్త డేటా యాడ్‌-ఆన్‌తో ప్యాక్‌ను సైతం జియో తీసుకొచ్చింది.

  • ₹333 ప్లాన్‌ గడువు 28 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది.
  • ₹583 ప్లాన్‌ గడువు 56 రోజులు. ఇందులో కూడా 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది.
  • ₹783 ప్లాన్‌ గడువు 84 రోజులు. 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లు, డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

ఈ మూడు ప్లాన్లలో జియో యాప్స్‌ ఉచితంగా లభిస్తాయి. అలాగే డేటా పరిమితి దాటిన తర్వాత ఇంటర్నెట్‌ వేగం 64 కేబీపీఎస్‌ మాత్రమే వస్తుంది. ఇక డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలు పొందాలంటే రీఛార్జి చేసిన నంబర్‌తో యాప్‌లో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. జియో నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా ప్రక్రియను పూర్తి చేయొచ్చు. మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను ఆనందించాలంటే ఏదైనా యాక్టివ్‌ ప్లాన్‌ను కలిగి ఉండాలి. అలాగే, ₹151 డేటా యాడ్‌-ఆన్‌ ప్లాన్‌తో 8జీబీ డేటా లభిస్తుంది. యాక్టివ్‌ ప్లాన్‌ గడువు పూర్తయ్యే వరకు ఈ ప్లాన్‌ పనిచేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని