Jio 5G: మరో 10నగరాల్లో జియో 5జీ సేవలు.. ఏపీలో ఈ నగరాల్లోనే..!
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Jio) మరో 10 నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఏపీలో ఇప్పటికే మూడు నగరాల్లో అందిస్తుండగా.. తాజాగా మరో రెండు నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది.
దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Jio) తన 5జీ సేవల్ని శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 10 నగరాల్లో 5జీ సేవలను (5G services) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఏపీలోని విజయవాడ, విశాఖ, గుంటూరులలో ఈ సేవల్ని అందిస్తుండగా.. తాజాగా తిరుపతి, నెల్లూరు నగరాల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. అలాగే, యూపీలోని ఆగ్రా, మీరఠ్, ప్రయోగరాజ్, కేరళలోని కోలికోడ్, త్రిస్సూరు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, అహ్మద్‌నగర్‌లలో సోమవారం నుంచి 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు జియో ఓ ప్రకటనలో తెలిపింది. తాజా ప్రకటనతో ప్రస్తుతం 85 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. జియో వెల్కమ్ ఆఫర్ కింద 1Gbps ప్లస్ వేగంతో అపరిమిత డేటా ఆయా నగరవాసులు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.
నాలుగు రాష్ట్రాల్లోని పది నగరాల్లో జియో ట్రూ 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు గర్వపడుతున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా వేగవంతమైన సేవల్ని అందించడం ద్వారా ప్రతి వినియోగదారుడూ ఈ కొత్త ఏడాదిలో ట్రూ 5జీ నెట్వర్క్ ప్రయోజనాలను ఆస్వాదించాలని కోరుకొంటున్నట్టు పేర్కొన్నారు. తమ సేవల్ని తాజాగా ప్రారంభించిన ఈ నగరాలు పర్యాటక, వాణిజ్యానికి ముఖ్యమైన గమ్యస్థానాలుగానే కాకుండా దేశంలో ముఖ్యమైన ఎడ్యుకేషన్ హబ్‌లుగా ఉన్నాయని పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో 5జీ సేవల్ని విస్తరించగా.. డిసెంబర్ నెలలో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాల్లో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08/02/23)
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Politics News
Kotamreddy: అమరావతి రైతులను పరామర్శించడమే నేను చేసిన నేరమా?: కోటంరెడ్డి
-
General News
TTD: ఫిబ్రవరి 9న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల