Jio: రిలయన్స్ జియో మరో ఆఫర్‌.. ₹ 198కే బ్రాడ్‌బ్యాండ్ సేవలు!

వినియోగదారులకు చౌకైన ఇంటర్నెట్‌ సేవలు అందిచాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో (Reliance Jio) సరికొత్త బ్రాడ్‌బ్యాండ్‌ (Broadband) ప్లాన్‌ను పరిచయం చేసింది. 

Published : 27 Mar 2023 22:28 IST

దిల్లీ: బ్రాండ్‌బ్యాండ్‌ (Broadband) వినియోగదారుల కోసం రిలయన్స్ జియో (Reliance Jio) సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం ₹ 198 నెలవారీ రుసుముతో బ్రాండ్‌బ్యాండ్‌ సేవలు అందించనున్నట్లు తెలిపింది. బ్యాకప్‌ ప్లాన్‌ (Back-up Plan) పేరుతో పరిచయం చేసిన ఈ ప్లాన్‌లో యూజర్లు 10 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలు పొందొచ్చు. ఈ ప్లాన్‌ తీసుకున్న యూజర్లు అదనంగా  ₹ 21 నుంచి ₹ 152 వరకు చెల్లించి ఒక రోజు నుంచి ఏడు రోజుల పాటు తమ ఇంటర్నెట్‌ వేగాన్ని 30 ఎంబీపీఎస్‌ నుంచి 100 ఎంబీపీఎస్‌ వరకు పెంచుకోవచ్చని జియో వెల్లడించింది. 

‘‘వినియోగదారులు ఇంటర్నెట్‌ అవసరాలను జియోకు బాగా తెలుసు. ఇంట్లో కూడా వారికి మెరుగైన బ్రాండ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు ఇప్పటికే జియో ఫైబర్‌ బ్యాకప్‌ను తీసుకొచ్చాం. కొత్తగా తీసుకొస్తున్నజియో బ్యాకప్‌ ప్లాన్‌తో వినియోగదారులు ఇంట్లో ఉండే సమయంలో తక్కువ ధరకే ఇంటర్నెట్‌ సేవలను అందించాలని కంపెనీ భావిస్తోంది’’ అని జియో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం జియో బ్రాడ్‌బ్యాండ్ 30 ఎంబీపీఎస్‌ వేగంతో  నెలవారీ ప్లాన్‌ ప్రారంభ ధర ₹399గా ఉంది. కొత్తగా తీసుకొస్తున్న ₹ 198 ప్లాన్‌తో జియో తన వినియోగదారుల పరిధిని మరింత విస్తరించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్‌ విభాగంలో  30.6 శాతం మార్కెట్‌ వాటాతో జియోకు 84 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని