Jio 5G: ఒకే రోజు 11 నగరాల్లో జియో 5జీ సేవలు ప్రారంభం
దేశంలోని 11 నగరాల్లో ఒకే రోజు 5జీ సేవలను రిలయన్స్ జియో ప్రారంభించింది. వెలకమ్ ఆఫర్ కింద ఆ నగర వాసులు ఉచిత డేటాను ఆస్వాదించొచ్చని కంపెనీ పేర్కొంది.
దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Jio) తన 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న 11 నగరాల్లో ఒకే రోజు 5జీ సేవలను (5G services) ప్రారంభించింది. ఇందులో తిరువనంతపురం, లఖ్‌నవూ, మైసూరు వంటి ప్రధాన నగరాలతో పాటు నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలీ, పంచకుల, జిరాకక్పూర్, ఖరార్, డేరాబస్సీ నగరాలు ఉన్నాయి.
ఆయా నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించిన తొలి సంస్థ తమదేని జియో ఓ ప్రకటనలో తెలిపింది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన నగరాల్లో ఒకేరోజు ఇంత పెద్ద ఎత్తున 5జీ సేవలు ప్రారంభించడం ఇదే తొలిసారని పేర్కొంది. ఈ నగరాలు ప్రముఖ పర్యాటక కేంద్రాలే కాకుండా ఎడ్యుకేషన్ హబ్‌లుగా ఉన్నాయని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. జియో వెల్కమ్ ఆఫర్ కింద 1Gbps వేగంతో ఉచితంగా అపరిమిత డేటా ఆయా నగరవాసులు వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి
-
Politics News
జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు