Jio: ప్రపంచంలోనే అతిపెద్ద 5జీ నెట్‌వర్క్‌గా జియో!

భారత్‌ అభివృద్ధికి జియో (Jio) మద్దతు ఎప్పుడూ ఉంటుదని, యూజర్లకు తక్కువ ధరకే నెట్‌వర్క్‌ సేవలను అందించడం ద్వారా ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేందుకు జియో ప్రయత్నిస్తోందని కంపెనీ ప్రెసిడెంట్ చెప్పారు.

Updated : 25 Mar 2023 16:08 IST

బార్సిలోనా: రిలయన్స్‌ జియో (Reliance Jio) నెట్‌వర్క్‌ 2023 చివరినాటికి ప్రపంచంలోనే అతిపెద్ద స్వతంత్ర 5జీ నెట్‌వర్క్‌ (5G Network)గా అవతరిస్తుందని జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌ ధీమా వ్యక్తం చేశారు. స్పెయిన్‌లో జరుగుతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC)లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ అభివృద్ధికి జియో మద్దతు ఎప్పుడూ ఉంటుందని, యూజర్లకు తక్కువ ధరకే నెట్‌వర్క్‌ సేవలను అందించడం ద్వారా ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ‘‘ ప్రపంచంలోనే స్వతంత్ర 5జీ నెట్‌వర్క్‌గా జియో అవతరించనుంది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ ఈ లక్ష్యాన్ని చేరుకుంటుంది.  జియో ద్వారా యూజర్లకు అడ్వాన్స్‌డ్‌ టెలికాం సేవలను అందించడమే కంపెనీ లక్ష్యం’’ అని మాథ్యూ చెప్పారు. 

ఎయిర్‌టెల్‌ టారిఫ్‌ ఛార్జీలు పెంచనుందనే వార్తలపై ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పందించారు. ఇతర టెలికాం సంస్థలు ఎన్‌పీఏపై ద్వారా సేవలందిస్తూ.. టారిఫ్‌ పెంపుపై దృష్టి సారిస్తే.. జియో కేవలం స్వతంత్ర నెట్‌వర్క్‌గా అవతరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కొద్దిరోజుల క్రితం టెలికాం పరిశ్రమ వ్యాపారంలో మూలధన రాబడి తక్కువగా ఉన్న కారణంగా టారిఫ్ ఛార్జీలను స్వల్పంగా పెంచే అవకాశం ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్ మిత్తల్‌ అన్నారు. గత నెలలో 28 రోజుల ప్లాన్ కనీస రీఛార్జ్ ధరను 57శాతం పెంచింది. రూ.99గా ఉన్న కనీస రీఛార్జీ ప్లాన్‌ ధరను రూ.155కు పెంచింది. మరోవైపు జియో దేశవ్యాప్తంగా 300 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తే.. ఎయిర్‌టెల్‌ 140 నగరాల్లో 5జీ సేవలను అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని