Jio vs Airtel vs VI: జియో vs ఎయిర్‌టెల్‌ vs వొడాఫోన్‌ ఐడియా.. పాపులర్‌ ప్లాన్ల కొత్త ధరలు ఇవే..

Jio vs Airtel vs VI: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు తమ మొబైల్‌ ప్లాన్ల ధరలను సవరించాయి.

Updated : 03 Jul 2024 12:43 IST

Jio vs Airtel vs VI | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్‌ ఐడియా (VI) తమ మొబైల్‌ టారిఫ్‌ ధరలను పెంచాయి. జియో, ఎయిర్‌టెల్‌ కొత్త ధరలు బుధవారం (జులై 3) నుంచి అందుబాటులోకి రాగా.. వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్లు 4 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీలతో 28 రోజులకు జియోలో కనీస రీఛార్జి మొత్తం రూ.189కి చేరగా.. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలో రూ.199కి పెరిగింది. 56 రోజుల ప్లాన్ విషయంలో మూడు టెలికాం కంపెనీల ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఎక్కువ మంది వినియోగించే 84 రోజుల ప్లాన్‌ ధర జియోలో రూ.666 నుంచి రూ.799కి పెరగ్గా.. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధరలు రూ.719 నుంచి ఏకంగా రూ.859కి ఎగబాకాయి. డేటా ప్లాన్‌, పోస్ట్‌ పెయిడ్‌ ధరలూ భారీగానే పెరిగాయి.

పోర్టింగ్‌కు కొత్త రూల్‌.. సిమ్‌ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!

దీనికి తోడు ఇన్నాళ్లు కనీస రీఛార్జి ప్యాకేజీలపై 5జీ డేటాను ఉచితంగా, అపరిమితంగా ఇస్తూ వచ్చిన జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు ప్లాన్ల సవరణ సందర్భంగా కొత్త నిబంధనను తీసుకొచ్చాయి. ఎవరైతే 2జీబీ కంటే ఎక్కువ రీఛార్జి చేస్తారో వారికే అపరిమిత 5జీ డేటాను అందిస్తామని ప్రకటించాయి. దీంతో 5జీ ఫోన్‌ ఉండి అపరిమిత డేటా ఆనందించాలంటే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. అంటే జియో యూజర్లు 84 రోజులకు రూ.859తోనూ, ఎయిర్‌టెల్‌ యూజర్లు రూ.979 రీఛార్జి చేయాల్సి ఉంటుంది.

పాపులర్‌ ప్లాన్లు, వాటి ధరలు ఇలా..

గమనిక: ఇవి కొన్ని పాపులర్‌ ప్లాన్ల వివరాలు మాత్రమే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని