JioFiber: రూ.899తో 550+ టీవీ ఛానెళ్లు.. 14+ ఓటీటీలు.. 100Mbps వేగంతో ఇంటర్నెట్
JioFiber: ఓటీటీలతో పాటు హైస్పీడ్ ఇంటర్నెట్ కావాలనుకునే యూజర్ల కోసం జియో ప్రత్యేక ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.899. ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఓటీటీ (OTT)లకు సైతం ఆదరణ క్రమంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా జియో ఫైబర్ (JioFiber) ఎప్పటికప్పుడు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను తీసుకొస్తోంది. ఇటీవల రూ.899 (జీఎస్‌టీ అదనం)తో ప్రత్యేక ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. దీంట్లో ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
నెలకు రూ.899 (జీఎస్‌టీ అదనం)తో వస్తున్న ఈ ప్లాన్‌లో మొత్తం 14కు పైగా ఓటీటీ (OTT) యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది. మూడు, ఆరు, 12 నెలల కాలవ్యవధితో కూడా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. నెలకు 3.3 టీబీ వరకు ‘ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP)’ పరిమితి ఉంటుంది. అంటే దాదాపు ఎలాంటి అంతరాయం లేకుండా నెలంతా 100ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
ఈ 100 ఎంబీపీఎస్ ప్లాన్‌తో హైస్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు 550కి పైగా టీవీ ఛానెళ్లను సైతం వీక్షించొచ్చు. లైవ్‌లో టీవీ షోలు, స్పోర్ట్స్ చూసేవారికి ఇది మంచి ఆప్షన్. ఈ ప్లాన్ తీసుకున్నవారికి జియో సెటాప్ బాక్స్‌ను ఉచితంగానే అందిస్తారు. ఓటీటీల (OTT) విషయానికి వస్తే డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, డిస్కవరీ+, ఈరోస్ నౌ, జియో సినిమా సహా మొత్తం 14కి పైగా యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: ‘బాబుతో నేను’.. చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాల ప్రవాహం
-
Chandrababu: హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ప్రారంభం
-
మనిషికి పంది గుండె.. రెండోరోజుకే చలోక్తులతో హుషారుగా ఉన్న రోగి!
-
రైలు పట్టాల కింద గుంత.. బాలుడి చొరవతో తప్పిన ప్రమాదం
-
పొత్తుకు తూట్లు పొడిచేలా ఎవరూ మాట్లాడొద్దు: నాగబాబు
-
కాలవ శ్రీనివాసులు దీక్ష భగ్నం