JioFiber: 150 ఎంబీపీఎస్‌ వేగంతో జియోఫైబర్‌లో వార్షిక ప్లాన్‌.. ధర, ప్రయోజనాలివే!

JioFiber: బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల కోసం జియో ఫైబర్‌ 150 ఎంబీపీఎస్‌ వేగంతో వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. దీని ధర, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..! 

Published : 15 May 2023 13:13 IST

JioFiber | ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ జియోకు చెందిన బ్రాడ్‌బ్యాండ్‌ విభాగం జియో ఫైబర్‌ (Jio Fiber) 150 ఎంబీపీఎస్‌ వేగంతో వార్షిక ప్లాన్‌ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్లు వివిధ రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఉచితంగా సెటాప్‌ బాక్స్‌ను పొందొచ్చు. వార్షిక ప్లాన్‌ వద్దనుకుంటే ఇతర కాలపరిమితులతో కూడా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయొచ్చు. ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

జియోఫైబర్‌ 150 ఎంబీపీఎస్‌ వేగంతో ఇస్తున్న వార్షిక ప్లాన్‌ ధర రూ.11,988+ జీఎస్టీ. అంటే నెలకు రూ.999 పడుతుంది. అయితే, ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకుండానే మరో 30 రోజుల పాటు జియోఫైబర్‌ (Jio Fiber) సర్వీసులను పొడిగిస్తుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే నెలకు రూ.923కే 150 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు.

ఈ ప్లాన్‌ కొనుగోలు చేసిన వారికి ఫిక్స్‌డ్‌లైన్‌ కనెక్షన్‌ లభిస్తుంది. దీంతో అపరిమిత కాలింగ్‌ను ఉచితంగానే అందిస్తారు. అయితే, ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌కు సంబంధించిన పరికరాలను మాత్రం కస్టమర్లు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రతినెలా 3.3 టీబీ పరిమితితో డేటా లభిస్తుంది. 

ఈ ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నవారు మైజియో యాప్‌ ద్వారా ఉచితంగా సెటాప్‌ బాక్స్‌ను క్లెయిం చేసుకోవచ్చు. ఓటీటీ ప్రయోజనాల విషయానికి వస్తే.. వూట్‌ సెలెక్ట్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, ప్రైమ్‌ వీడియో, సోనీలివ్‌, సన్‌నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, జీ5, హోయ్‌చొయ్‌, డిస్కవరీ+, లయన్స్‌గేట్‌ ప్లే, యూనివర్సల్‌+, జియోసినిమా, ఈరోస్‌నౌ, షెమరూమీ, ఆల్ట్‌బాలాజీ, జియోసావన్‌లోని కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని