JioFiber: జియో బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌.. ₹1200లకే 3 నెలల ఇంటర్నెట్‌

Jio Fiber plans: జియో మూడు నెలల ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద 30 ఎంబీపీఎస్‌తో అపరిమిత డేటా లభిస్తుంది. కాలింగ్‌ సదుపాయం కూడా ఉంటుంది.

Published : 26 May 2023 17:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెలికాం మార్కెట్‌పై తనదైన ముద్ర వేసిన జియో.. అటు జియో ఫైబర్‌ (Jio fiber) ద్వారా బ్రాండ్‌బ్యాండ్‌ సర్వీసుల విషయంలోనూ అంతే దూకుడుగా ముందుకెళుతోంది. చౌక ధరలో ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు తీసుకొస్తోంది. తాజాగా ఫైబర్‌ యూజర్ల కోసం మూడు నెలల ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.1197గా నిర్ణయించింది.

కేవలం ఇంటర్నెట్‌ మాత్రమే కోరుకునే వారి కోసం ఈ మూడు నెలల ప్లాన్‌ సరిపోతుంది. 90 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌ కింద 30 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ లభిస్తుంది. ప్రతినెలా అపరిమిత డేటా (3.3 TBవరకు)తో పాటు కాలింగ్‌ సదుపాయం ఇందులో ఉంటుంది. ఓటీటీ బెన్‌ఫిట్స్‌ మాత్రం లభించవు. ప్లాన్‌ మొత్తానికి జీఎస్టీ అదనం.

జియో ఫైబర్‌లో ప్లాన్లు రూ.399 నుంచి ప్రారంభమవుతున్నాయి. బేసిక్‌ ప్లాన్లు లభించే సదుపాయాలే మూడు నెలల ప్లాన్‌లోనూ ఉన్నాయి. అయితే, ప్రతినెలా రీఛార్జి చేసుకునే బదులు ఒకేసారి రీఛార్జి చేసుకునే వారికి ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. ఒకవేళ టీవీ ఛానెళ్లు, ఓటీటీ వంటివి కావాలనుకునే వారు అధిక మొత్తం చెల్లించి ఇతర ప్లాన్లు తీసుకోవాల్సి ఉంటుంది. రూ.1197ప్లాన్‌ మాదిరిగానే 100 ఎంబీపీఎస్‌తో వచ్చే రూ.699 ప్లాన్‌ను మూడు నెలకు రూ.2097లకు; 150 ఎంబీపీఎస్‌తో వచ్చే రూ.999 ప్లాన్‌ను రూ.2997కు; 300 ఎంబీపీఎస్‌ వేగంతో వచ్చే రూ.1499 ప్లాన్‌ను రూ.4497కు.. ఇలా మరికొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్లను త్రైమాసిక ప్లాన్ల రూపంలో జియో అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని