JioTag Air: మీ వస్తువులు మరిచిపోరిక.. రిలయన్స్‌ నుంచి జియో ట్యాగ్‌ ఎయిర్‌

JioTag Air: రిలయన్స్‌ జియో సంస్థ కొత్త ట్రాకింగ్‌ పరికరాన్ని లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.1499గా నిర్ణయించింది.

Published : 10 Jul 2024 17:50 IST

JioTag Air | ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ జియో మరో స్మార్ట్‌ పరికరాన్ని తీసుకొచ్చింది. గతంలో తీసుకొచ్చిన జియో ట్యాగ్‌కు కొనసాగింపుగా జియో ట్యాగ్‌ ఎయిర్‌ను (JioTag Air) తాజాగా లాంచ్ చేసింది. తాళాలు, లగేజీ, వాలెట్‌, పెంపుడు జంతువులు మిస్‌ అవ్వకుండా ఉండేందుకు ఈ స్మార్ట్‌ డివైజ్‌ పనికొస్తుంది. ఇందులో ఫైండ్‌ డివైజ్‌ ఫీచర్‌ ద్వారా ఆయా వస్తువులను ఎక్కడున్నా గుర్తించొచ్చు. తరచూ ఏ వస్తువు ఎక్కడ పెట్టామో మరిచిపోయే వారికి ఈ డివైజ్‌ పనికొస్తుంది. జియోట్యాగ్‌ ఎయిర్‌ ధరను ప్రారంభ ఆఫర్‌ కింద రూ.1,499గా నిర్ణయించారు. జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్‌, అమెజాన్‌ ఇండియాలో కొనుగోలు చేయొచ్చు. బ్లూ, గ్రే, రెడ్‌ కలర్స్‌లో లభిస్తుంది.

క్రెడ్‌, పేటీఎం, ఎంపిక చేసిన కార్డులతో జియో ట్యాగ్‌ ఎయిర్‌ను కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. జియో ట్యాగ్‌ ఎయిర్‌ రెండు రకాల ట్రాకింగ్‌ యాప్స్‌తో పనిచేస్తుంది.  ఆండ్రాయిడ్‌ యూజర్లు జియో థింగ్స్‌ యాప్‌తో దీన్ని వినియోగించొచ్చు. యాపిల్‌ యూజర్లు ఫైండ్‌ మై నెట్‌వర్క్‌ యాప్‌ ద్వారా ఈ డివైజ్‌ను వాడొచ్చు. ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్‌ 14, ఆపై ఓఎస్‌తో ఫోన్లలో ఈ యాప్‌ పనిచేస్తుంది. ఈ ట్రాకర్‌ బ్లూటూత్‌ 5.3తో పనిచేస్తుంది. బిల్ట్‌ ఇన్‌ స్పీకర్‌ కూడా ఉంటుంది. ఇది 90-120 db రేంజ్‌తో శబ్దం చేయగలదు. ఈ బుల్లి డివైజ్‌ బరువు కేవలం 10 గ్రాములే. ఇందులోని బ్యాటరీ 12 నెలల పాటు పనిచేస్తుంది. అదనపు బ్యాటరీ, ల్యాన్‌యార్డ్‌ రిటైల్‌ బాక్సులో అదనంగా అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని