Jaguar Land Rover: జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ సీఈవో రాజీనామా

టాటా గ్రూప్‌నకు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (Jaguar Land Rover) సీఈవో థియర్రీ బొల్లోర్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Published : 16 Nov 2022 21:41 IST

దిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (Jaguar Land Rover) సీఈవో థియర్రీ బొల్లోర్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని టాటా మోటార్స్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బుధవారం పేర్కొంది. డిసెంబర్‌ 31న ఆయన బాధ్యతల నుంచి పూర్తి స్థాయిలో తప్పుకోనున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది.

జాగ్వార్‌ సీఈవోగా బొల్లోర్‌ 2020 సెప్టెంబర్‌లో నియమితులయ్యారు. రాల్ఫ్‌ స్పెత్‌ నుంచి బాధ్యతలు అందుకున్నారు. దాదాపు రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. బొల్లోర్‌ రాజీనామా నేపథ్యంలో తాత్కాలిక సీఈవోగా అడ్రెయిన్‌ మార్డెల్‌ను కంపెనీ నియమించింది. ఆయన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌లో 32 ఏళ్లుగా పనిచేస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మెంబర్‌గా ఉన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని