Canara Bank: కెనరా బ్యాంకు ఎండీ, సీఈఓగా తెలుగు వ్యక్తి

Canara Bank: క1988లో విజయ బ్యాంకుతో సత్యనారాయణ రాజు తన బ్యాంకింగ్‌ కెరీర్‌ను ప్రారంభించారు. తాజాగా కెనరా బ్యాంక్‌ సీఈఓగా నియమితులయ్యారు.

Published : 07 Feb 2023 23:01 IST

బెంగళూరు: ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు (Canara Bank) ఎండీ, సీఈఓగా తెలుగు వ్యక్తి అయిన కె.సత్యనారాయణ రాజు (K Satyanarayana Raju)ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. ఎల్వీ ప్రభాకర్‌ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

సత్యనారాయణ రాజు (K Satyanarayana Raju) భౌతికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌)లో పీజీ చేశారు. 2021 మార్చి 10 వరకు కెనరా బ్యాంకులోనే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. బ్యాంకింగ్‌ రంగంలోని అన్ని విభాగాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. బ్రాంచ్‌ బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ క్రెడిట్‌, రిటైల్‌ క్రెడిట్‌, అగ్రి ఫైనాన్సింగ్‌, క్రెడిట్‌ మానిటరింగ్‌, క్రెడిట్‌ రికవరీ.. ఇలా అన్ని రంగాల్లో ఆయన పనిచేశారు. బ్యాంకింగ్‌ ఉత్పత్తులు, సేవలకు డిజిటల్ హంగులు అద్దడంలో కీలకంగా వ్యవహరించారు.

1988లో విజయ బ్యాంకుతో సత్యనారాయణ రాజు తన బ్యాంకింగ్‌ కెరీర్‌ను ప్రారంభించారు. అలా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయి వరకు చేరుకున్నారు. విజయ బ్యాంక్‌ను ప్రభుత్వం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేసిన విషయం తెలిసిందే. తర్వాత కెనరా బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా చేరి ఇప్పుడు సీఈఓగా ఎంపికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని