4 గంటలు ఛార్జ్‌ చేస్తే 120 కి.మీ.

రోజు రోజుకీ పెట్రోల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. పర్యావరణ హితం కూడా కావడం  వీటి ప్రత్యేకత.

Updated : 23 Aug 2022 10:33 IST

న్యూదిల్లీ: రోజు రోజుకీ పెట్రోల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. పర్యావరణ హితం కూడా కావడం  వీటి ప్రత్యేకత. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు సైతం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై మరింత దృష్టి పెడుతున్నాయి. గోవాకు చెందిన అంకుర సంస్థ కబిరా మొబిలిటీ విపణిలోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను విడుదల చేసింది. ‘హెర్మెస్‌ 75’ పేరుతో తీసుకొచ్చిన దీని ధర రూ.89,600(ఎక్స్‌ షోరూమ్‌ గోవా). జూన్‌ 2021 నుంచి దీని విక్రయాలను ప్రారంభించనున్నారు.

ఇందులో 2500వాట్స్‌ డెల్టా హబ్‌ మోటార్‌తో పాటు, 60 వాట్‌ 40 యాంపైర్‌ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఫాస్ట్‌ ఛార్జర్‌తో 100 శాతం బ్యాటరీ పూర్తవడానికి కేవలం 4 గంటల సమయం పడుతుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 120కి.మీ. సులభంగా వెళ్లవచ్చని కంపెనీ చెబుతోంది. హెర్మస్‌ 75 అత్యధిక వేగం గంటకు 80కి.మీ.

స్వాపబుల్‌ బ్యాటరీ ఆప్షన్‌ను కూడా ఈ బైక్‌లో తీసుకొచ్చారు. అంటే బ్యాటరీని బయటకు తీసి ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్‌ చేస్తే, ఫిక్స్‌డ్‌ బ్యాటరీ కలిగిన బైక్‌ 120కి.మీ.,  స్వాపబుల్‌ బ్యాటరీ అయితే 80కి.మీ. ప్రయాణించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని