MCLR: వడ్డీ రేటు పెంచిన కరూర్‌ వైశ్యా బ్యాంక్‌

వివిధ కాలవ్యవధులకు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బేస్‌డ్‌ లెండింగ్‌ రేట్లను(ఎంసీఎల్‌ఆర్‌ను) ఈ బ్యాంకు పెంచింది.

Published : 06 Dec 2022 17:26 IST

దిల్లీ: కరూర్‌ వైశ్యా బ్యాంకు రుణ వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్‌ 8.80% నుంచి 9.05%కు పెరిగింది. కొత్త రేట్లు 2022 డిసెంబరు 6 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. ఆర్‌బీఐ దేశీయ రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నంలో బెంచ్‌మార్క్‌ రెపో రేటును మొత్తం 3 సార్లు పెంచి 5.90% చేసింది. రేపు మరోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని