Kawasaki: మార్కెట్లోకి కవాసాకీ నుంచి క్లాసీ బైక్‌.. ధర రూ.1.47 లక్షలు

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ కవాసాకీకి చెందిన దేశీయ విభాగం ఇండియా కవాసాకీ మోటార్స్‌ (IKM) భారత మార్కెట్‌లోకి ఓ కొత్త బైక్‌ను విడుదల చేసింది.

Published : 26 Sep 2022 22:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ కవాసాకీకి చెందిన దేశీయ విభాగం ఇండియా కవాసాకీ మోటార్స్‌ (IKM) భారత మార్కెట్‌లోకి ఓ కొత్త బైక్‌ను విడుదల చేసింది. ప్రీమియం బైక్‌ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ.. తాజాగా W175 MY23 పేరిట ఓ క్లాసిక్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.1.47 లక్షలు(ఎక్స్‌షోరూమ్‌) గా నిర్ణయించింది. ఎరుపు రంగులో స్పెషల్‌ ఎడిషన్‌ను కూడా తీసుకొచ్చింది. ఇది సాధారణ వేరియంట్‌ కంటే రూ.2వేలు అదనం. పరిమిత సంఖ్యలో ఈ స్పెషల్‌ ఎడిషన్‌ను విక్రయిస్తారు.

ఇక బైక్‌ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. 177 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌కూల్డ్‌ ఎఫ్‌ఐ బీఎస్‌-6 ఇంజిన్‌ ఇందులో అమర్చారు. ఈ ఇంజిన్‌ 13 పీఎస్‌ పవర్‌ను 13.3 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉంది. డిజిటల్‌ రెట్రోస్టైల్‌ స్పీడోమీటర్‌ ఇస్తున్నారు. 270 ఎంఎం ఫ్రంట్‌ డిస్క్‌.. సింగిల్‌ ఛానల్‌ ఏబీఎస్‌తో వస్తోంది. వెనుకవైపు డ్యూయల్‌ షాక్‌ రియర్‌ సస్పెన్షన్‌ ఇస్తున్నారు. బైక్‌కు సంబంధించిన చాలా వరకు విడి భాగాల డిజైన్‌, రూపకల్పన కవాసాకీ మోటార్స్‌ ఆర్‌అండ్‌ డీ టెక్నికల్‌ సెంటర్‌లోనే జరిగిందని కంపెనీ తెలిపింది. ఈ బైక్‌ డెలివరీలు డిసెంబర్‌ నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని