Festive Season: పండుగ స‌మ‌యంలో డ‌బ్బు నిర్వ‌హ‌ణ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి..

వాట‌ర్ ట్యాంక్ నిండాలంటే నీరు పోస్తే స‌రిపోదు.. ట్యాంకుకు ఎక్క‌డా లీకులు లేకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అలాగే పెట్టుబ‌డుల కోసం డ‌బ్బు పొదుపు చేయాలంటే ఖ‌ర్చుల‌ను నియంత్రించుకోవాలి. అప్పుడే ఎక్కువ మొత్తం పొదుపు చేయ‌గ‌లం. ఒక‌దాని త‌రువాత ఒక‌టి వ‌చ్చే పండుగ‌లు.. వీటితోనే ముడిప‌డిన కుటుంబ సంతోషం. ఎంత నియంత్ర‌ణలో ఉంచాల‌నుకున్న కొన్ని ఖ‌ర్చులైతే చేయ‌క త‌ప్ప‌దు. అందుకే పండుగ సీజ‌న్‌లో డ‌బ్బు నిర్వ‌హ‌ణ స‌వాలుగా మారుతుంది. పండుగ స‌మయంలో విలాసాల‌కు పోకుండా మీ డ‌బ్బును మెరుగైన ప‌ద్ద‌తిలో నిర్వ‌హిస్తే పండుగ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించ‌వ‌చ్చు. 


విలాసం.. అవ‌స‌రం.. మ‌ధ్య‌ తేడా గుర్తించాలి..
విలాసానికి.. అవ‌స‌రానికి మ‌ధ్య తేడా ఉంటుంది. ఇది తెలుసుకున్న‌ప్పుడే ఖ‌ర్చుల‌ను అదుపులో పెట్టుకోగ‌లం. మ‌నం దేని కోసం ఖ‌ర్చుపెడుతున్నామో.. అది లేకుండా ప‌ని జ‌ర‌గడం క‌ష్టం అవుతుంటే అది అవ‌స‌రం. అది లేకుండా కూడా ప‌నులు ఆగ‌వు అనుకుంటే.. దాని అవ‌స‌రం అంత లేదు అనిఅర్థం. పండుగ‌ల సంద‌ర్భంగా ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుంటాయి కంపెనీలు. ఒక‌టి కొంటే ఒక‌టి ఉచితం, 50శాతం డిస్కౌట్‌, క్యాష్ బ్యాక్‌లు.. ఇలా అనేక ర‌కాల ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తుంటాయి. వీటికి ఆక‌ర్షితులై అవ‌స‌రం లేకుండా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తూ, అస‌వర‌పు ఖ‌ర్చులు చేస్తే పొదుపు త‌గ్గిపోతుంది. త‌ద్వారా పెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. కొనుగోలు విష‌యంలో మాన‌సిక దృక్ప‌థాన్ని మార్చుకోవ‌డం కీల‌కం.

అవ‌స‌రం అనుకుంటేనే రుణం..
షాపింగ్ కోసం రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి సంస్థ‌లు. వీలునంత వ‌ర‌కు అప్పు చేసి కొనుగోళ్లు చేయ‌కూడ‌దు. నిజంగా వ‌స్తువు అవ‌స‌రం ఉంటే.. కావ‌ల‌సిన వ‌స్తువుల జాబితాను త‌యారు చేసుకుని.. జాబితా ప్ర‌కారం నో-కాస్ట్ ఈఎమ్ఐలు కొనుగోలు చేయ‌డం మంచిది. వ‌స్తువు కొనుగోలుకు స‌మ‌యం ఉంది అనుకుంటే.. అందుకు కావ‌ల‌సిన మొత్తాన్ని పొదుపు చేసి కొనుగోలు చేయ‌డం మంచిది. 

క్రెడిట్ కార్డ్‌ని తెలివిగా ఉప‌యోగించండి..
మొద‌ట వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి.. త‌ర్వాత బిల్లు చెల్లించే స‌దుపాయం క‌ల్పిస్తుంది క్రెడిట్‌కార్డ్‌. దీంతో చాలామంది ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేసి త‌ర్వాత బిల్లు చెల్లించేందుకు ఇబ్బందిప‌డుతుంటారు. మీ కార్డు ప‌రిమితి ఎంత ఉందో తెలుసుకొని అంతే కొనుగోలు చేయాలి. అన‌వ‌స‌రంగా ఎక్కువ‌గా ఖ‌ర్చు చేసి అప్పుల భారీన ప‌డ‌కూడ‌దు. చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డుల‌పై రివార్డు పాయింట్ల‌ను, క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ల‌ను అందిస్తాయి. అందుకే క్రెడిట్ కార్డుల‌ను తెలివిగా ఉప‌యోగించ‌డం అల‌వాటు చేసుకోవాలి. క్రెడిట్ కార్డును యాక్టివ్‌గా వినియోగిస్తుంటే మీకు రివార్డు పాయింట్లు వ‌స్తుంటాయి. అది చాలా మందికి అర్థంకాక వృథా చేసుకుంటారు. వాటి గ‌డువు తీర‌క‌ముందే ఉప‌యోగించుకుంటే ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. పండుగ సీజ‌న్‌లో షాపింగ్ చేసేప్పుడు, విహార యాత్ర‌ల‌కు వెళ్లేప్పుడు ఈ రివార్డు పాయింట్ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. 

అతిగా ఖ‌ర్చుపెట్ట‌కండి..
పండుగ సీజన్‌లో ఆర్థిక నిర్వహణ కొన్నిసార్లు గజిబిజిగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మనం అనుకున్న బ‌డ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి ఒక వ్య‌క్తి క్రెడిట్ కార్డు ద్వారా రూ.1.5ల‌క్షల‌ విలువైన వ‌స్తువుల‌ను కొనుగోలు చేశాడ‌నుకుందాం. నిజానికి అత‌ని బ‌డ్జెట్ రూ.ల‌క్ష మాత్ర‌మే కాని రూ.50వేలు అద‌నంగా ఖ‌ర్చు అయ్యింది. చెల్లించాల్సిన స‌మ‌యం వ‌చ్చేస‌రికి స‌రిప‌డినంత డ‌బ్బు అంద‌లేదు. మ‌రి ఆ వ్య‌క్తి బిల్లును ఎలా చెల్లిస్తాడు. ఇందుకు రెండు మార్గాలు ఎంచుకునే అవ‌కాశం ఉంది. మొద‌ట‌ది క్రెడిట్ కార్డు క‌నీస మొత్తాన్ని చెల్లించి మిగిలిన మొత్తాన్ని వాయిదాల ప‌ద్ధ‌తికి మార్చుకోవ‌డం ఇందులో దాదాపు 36శాతం వ‌ర‌కు వ‌డ్డీ వ‌ర్తించే అవ‌కాశం ఉంది. ఇక రెండ‌వ ప‌ద్ధ‌తి 14 నుంచి 16 వ‌డ్డీ రేటుతో వ‌చ్చే వ్య‌క్తిగ‌త రుణాన్ని తీసుకోవ‌డం. ఈ రెండు విధానాల‌లో వ‌డ్డీ కారణంగా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వ‌స్తుంది. ఇవి మీ పొదుపును ఖ‌ర్చువైపు మ‌ళ్లిస్తుంది కాబ‌ట్టి నిర్థిష్ట స‌మ‌యంలో తిరిగి చెల్లించ‌లేము అనుకంటే ఖ‌ర్చు పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిది. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని