K Light 250V Motorcycle: కీవే నుంచి కె లైట్‌ 250వీ బైక్‌ @ రూ.2.89 లక్షలు

హంగేరీకి చెందిన ద్విచక్రవాహన తయారీ సంస్థ కీవే భారత్‌లో కె-లైట్‌ 250వీ పేరిట కొత్త బైక్‌ను విడుదల చేసింది....

Published : 05 Jul 2022 16:43 IST

దిల్లీ: హంగేరీకి చెందిన ద్విచక్రవాహన తయారీ సంస్థ కీవే భారత్‌లో కె-లైట్‌ 250వీ పేరిట కొత్త బైక్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.2.89 లక్షలు (ఎక్స్‌షోరూం). 249 సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో వస్తోన్న ఈ బైక్‌ డెలివరీలు ఈనెల మూడో వారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీన్ని మొత్తం మూడు రంగుల్లో అందిస్తున్నారు. రంగులను బట్టి ధరలు మారతాయి. 

రిమోట్‌ ఇంజిన్‌ కట్‌-ఆఫ్‌, జియో ఫెన్స్‌, రైడ్‌ రికార్డుల నిర్వహణ, వేగంపై పరిమితి వంటి ఫంక్షన్లతో కూడిన కీవే కనెక్ట్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకు మరో ఐదు వాహనాలను తీసుకురానున్నట్లు కంపెనీ ఎండీ వికాస్‌ ఝాబఖ్‌ తెలిపారు. వ్యాపార విస్తరణకు అనుగుణంగా డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు. 2023 నాటికి 100 డీలర్లను జత చేయనున్నట్లు తెలిపారు.

250 సీసీ సెగ్మెంట్‌లో వీ-ట్విన్‌ సిలిండర్‌, బెల్ట్‌ డ్రైవ్‌ సిస్టంతో వస్తోన్న తొలి బైక్‌ ఇదేనని కీవే తెలిపింది. ఈ బైక్‌ 8500 ఆర్‌పీఎం వద్ద 18.7 హెచ్‌పీ శక్తిని.. 5500 ఆర్‌పీఎం వద్ద 19ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తోంది. ముందు, వెనుక డిస్క్‌ బ్రేక్‌లతో వస్తోన్న ఈ బైక్‌లో డ్యుయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ వ్యవస్థ అందుబాటులో ఉంది. 20 లీటర్ల భారీ ఇంధన ట్యాంకు ఉండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని