Auto Sales: వాహన విక్రయాలను వీడని చిప్‌ల కొరత!

నవంబరు నెలలోనూ వాహన విక్రయాలను ఎలక్ట్రానిక్‌ చిప్‌ల కొరత దెబ్బతీసింది. గత గత కొన్ని నెలల్లో ఈ కారణంగా భారీ స్థాయిలో విక్రయాలు పడిపోగా....

Updated : 22 Aug 2022 16:21 IST

నవంబరులోనూ క్షీణించిన అమ్మకాలు

దిల్లీ: నవంబరు నెలలోనూ వాహన విక్రయాలను ఎలక్ట్రానిక్‌ చిప్‌ల కొరత దెబ్బతీసింది. గత గత కొన్ని నెలల్లో ఈ కారణంగా భారీ స్థాయిలో విక్రయాలు పడిపోగా.. నవంబరులోనూ పరిస్థితి ఏమీ మారలేదు. దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ(ఎంఎస్‌ఐ) వాహన విక్రయాల్లో 09% క్షీణత కనిపించింది. గత నెలలో అమ్మకాలు 1,39,184 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2020 నవంబరులో ఈ కంపెనీ 1,53,223 వాహనాలు విక్రయించింది. ఎంఎస్‌ఐ దేశీయ విక్రయాలు 1,44,219 నుంచి 18 శాతం తగ్గి 1,17,791కి పరిమితమయ్యాయి. చిన్న కార్లలో ఆల్టో, ఎస్‌-ప్రెసోల విక్రయాలు 22,339 నుంచి 17,473కు పడిపోయాయి. కాంపాక్ట్‌ కార్ల విభాగంలో స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ విక్రయాలు 76,630 నుంచి 57,019కి తగ్గిపోయాయి. మధ్యస్థాయి సెడాన్‌ సియాజ్‌ అమ్మకాలు 1,870 నుంచి 1,089కి పడిపోయాయి.  ఎర్టిగా, ఎస్‌-క్రాస్‌, విటారా బ్రెజా, విక్రయాలు 23,753 నుంచి 24,574కు చేరాయి. ఎగుమతుల విషయానికి వస్తే గత ఏడాది ఇదే నెలలో 9,004 యూనిట్లు ఎగుమతి కాగా.. ఈసారి అవి 21,393 యూనిట్లకు పెరిగాయి.

* ఇక మరో వాహన దిగ్గజం హ్యుందాయ్‌ టోకు అమ్మకాలు సైతం పడిపోయాయి. క్రితం ఏడాది నవంబరులో 59,200 యూనిట్లు అమ్ముడు కాగా.. ఈసారి అవి 43,556కు పరిమితమయ్యాయి.    59,913 నుంచి 24 శాతం తగ్గి 46,910 యూనిట్లకు పడిపోయాయి. టొయోటా కిర్లోస్కర్, నిస్సాన్‌ విక్రయాలు మాత్రం నవంబరు నెలలో పెరగడం విశేషం.

కంపెనీ            2021        2020       క్షీణత/(వృద్ధి)%

మారుతీ సుజుకీ    1,53,223     1,39,184        09
నిస్సాన్‌              5,605     3,502        (35.4)
ఎంజీ మోటార్‌        2,481     4,163          24
టాటా మోటార్స్‌      49,650    62,192        (25)
హ్యుందాయ్‌         46,910    59,200         21
మహీంద్రా           40,102     42,731         06
టొయోటా           13,003     8,508         (53)

ట్రాక్టర్లు..

ఎస్కార్ట్స్‌         7,116     10,165            30
మహీంద్రా        27,681    32,726            15

ద్విచక్రవాహనాలు    

బజాజ్‌ ఆటో      3,38,473    3,84,993         12
టీవీఎస్‌ మోటార్‌   2,72,693    3,22,709        15

వాణిజ్య వాహనాలు

వీఈసీవీ        4,085    3,710           (10.1)
అశోక్‌ లేలాండ్‌    10,480    10,659        (02)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని