Kia India Anantapur: కియా అనంతపురం కేంద్రం నుంచి 5లక్షల కార్లు

అనంతపూర్‌లో ఉన్న తమ తయారీ కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఐదు లక్షల యూనిట్లను మార్కెట్‌లోకి పంపినట్లు ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా మంగళవారం ప్రకటించింది....

Updated : 22 Feb 2022 15:15 IST

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న తమ తయారీ కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఐదు లక్షల యూనిట్లను మార్కెట్‌లోకి పంపినట్లు ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా మంగళవారం ప్రకటించింది. వీటిలో నాలుగు లక్షల వరకు దేశీయంగా విక్రయిస్తే.. మరో లక్ష కార్లను విదేశాలను ఎగుమతి చేసినట్లు వెల్లడించింది. దాదాపు 91 దేశాలకు కియా కార్లు ఎగుమతి అవుతున్నాయి. సెల్టోస్‌ ఎగుమతులు సెప్టెంబరు 2019 నుంచే ప్రారంభమయ్యాయి.

యుటిలిటీ వాహనాల ఎగుమతుల్లో దేశంలో కియాదే తొలిస్ధానమని సంస్థ పేర్కొంది. 2021లో మార్కెట్‌ వాటాలో తమ కంపెనీదే 25 శాతమని తెలిపింది. 2.5 ఏళ్లలోనే ఈ ఘనత సాధించామని కియా ఇండియా ఎండీ, సీఈఓ తే-జిన్‌ పార్క్‌ తెలిపారు. సరికొత్త ఫీచర్లతో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన కరెన్స్‌తో తదుపరి మైలురాళ్లను మరింత వేగంగా చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 15న విడుదలైన ఈ కారుకు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని