Kia: అదనపు ఫీచర్లతో కియా సోనెట్‌, సెల్టోస్‌

ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా సెల్టోస్‌, సోనెట్‌ మోడల్‌ కార్లను మరింత నూతనంగా తీర్చిదిద్దింది. మరిన్ని కొత్త హంగులను చేర్చి మార్కెట్‌లోకి విడుదల చేసింది....

Published : 08 Apr 2022 15:47 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా సెల్టోస్‌, సోనెట్‌ మోడల్‌ కార్లను మరింత నూతనంగా తీర్చిదిద్దింది. మరిన్ని కొత్త హంగులను చేర్చి శుక్రవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. కొత్త సెల్టోస్‌ ప్రారంభ ధర రూ.10.19 లక్షలు కాగా.. సోనెట్‌ ధర రూ.7.15 లక్షలు.

కొత్త వెర్షన్లలకు సంబంధించిన అన్ని వేరియంట్లలో 4 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసినట్లు కియా తెలిపింది. భద్రతను మరింత పెంచడంలో భాగంగా కారు పక్క భాగంలో కూడా ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. అలాగే పెద్ద వేరియంట్లలో ఉన్న కొన్ని హంగులను కింది వేరియంట్లలో కూడా చేర్చారు. ఈ కార్లన్నింటినీ కొత్త కియా కనెక్ట్‌ యాప్‌తో ఆధునికీకరించినట్లు తెలిపారు. కియా సెల్టోస్‌ డీజిల్‌ ఇంజిన్‌ కార్లలో ఇంటెలిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ సాంకేతికతను పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2.67 లక్షల యూనిట్ల సెల్టోస్‌, 1.25 లక్షల యూనిట్ల సోనెట్‌ కార్లను విక్రయించినట్లు కియా తెలిపింది. సెల్టోస్‌లో 13 అదనపు ఫీచర్లు, సోనెట్‌లో 9 కొత్త ఫీచర్లను చేర్చినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని