Updated : 03 Aug 2022 14:57 IST

Kia Seltos: కియా సెల్టోస్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులు..

దిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా (kia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఎక్కువగా అమ్ముడుపోయే తన మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ సెల్టోస్‌ (Kia Seltos)లో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగులను (air bags) అందించాలని నిర్ణయించింది. ఈ మోడల్‌కు చెందిన అన్ని ట్రిమ్స్‌లోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇదే కంపెనీకి చెందిన కరెన్స్‌ మోడల్‌లో ఇప్పటికే ఆరు ఎయిర్‌బ్యాగులు అందిస్తున్నారు.

మార్కెట్‌ రీసెర్చి, కస్టమర్ల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని తమ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నట్లు కియా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, సేల్స్‌ మార్కెటింగ్‌ హెడ్‌ హర్దీప్‌ సింగ్‌ బ్రార్‌ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలోకెల్లా కియాకు ముఖ్యమైన మార్కెట్‌ భారత్‌ అని, అందులోనూ సెల్టోస్‌ అతి ముఖ్యమైనదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆ కంపెనీ విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో 60 శాతం వాటా సెల్టోస్‌దే కావడం గమనార్హం.

మరోవైపు కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులు ఉండాలన్న నిర్ణయాన్ని తప్పనిసరి చేసేందుకు కేంద్రం యోచిస్తోంది. 8 మంది వరకు ప్రయాణించగలిగే కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులను తప్పనిసరి చేయాలని చూస్తోంది. ప్రమాదాల సమయంలో ప్రయాణికులను తీవ్ర గాయాల నుంచి రక్షించేందుకు ఈ ఎయిర్‌బ్యాగులు ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎయిర్‌ బ్యాగుల సంఖ్య పెంచాలని చూస్తోంది. ప్రస్తుతం విక్రయమవుతున్న కార్లలో 2 లేదా 4 ఎయిర్‌బ్యాగులు మాత్రమే ఉంటున్నాయి. ఈ సంఖ్యను 6కు పెంచాలని ప్రభుత్వం భావిస్తుండగా.. దీనివల్ల ఖర్చు పెరుగుతుందని కంపెనీలు అంటున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని