Kia Carens: 44 వేల కియా కరెన్స్‌ కార్ల రీకాల్‌.. ఎందుకో తెలుసా?

కియా ఇండియా దాదాపు 44 వేల కరెన్స్‌ మోడల్‌ కార్లను రీకాల్‌ చేసింది. 6, 7 సీట్ల సామర్థ్యంతో వస్తున్న ఈ కార్లను ఫిబ్రవరిలో విడుదల చేశారు.

Published : 04 Oct 2022 12:46 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) తమ తాజా మోడల్‌ కరెన్స్‌ (Carens) కార్లను రీకాల్‌ (Recall) చేస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఎయిర్‌బ్యాగ్‌ నియంత్రణా సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా లోపాలున్నాయేమో తనిఖీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దాదాపు 44 వేల కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ ఏమైనా లోపాన్ని గుర్తిస్తే ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ సేవల్ని అందజేస్తామని చెప్పింది. దీనిపై తాము నేరుగా కరెన్స్‌ యజమానులనూ సంప్రదిస్తామని వెల్లడించింది. ఒకవేళ ఏ కారులోనైనా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అవసరమని తమ సిబ్బంది నిర్ణయిస్తే సదరు యజమానులు నిరంతరం కియా డీలర్‌షిప్‌ ప్రతినిధులతో సంప్రదింపుల్లో ఉండాలని సూచించింది. తగు సమయాన్ని చూసుకొని కావాల్సిన మార్పులు చేస్తామని పేర్కొంది. 6, 7 సీట్ల సామర్థ్యంతో వస్తున్న కరెన్స్‌ను ఈ  ఏడాది ఫిబ్రవరిలో కియా విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని