PAN Aadhaar: ఆధార్‌తో లింక్ చేయ‌ని పాన్ ఎప్ప‌టి వ‌ర‌కు ప‌నిచేస్తుంది?

పాన్ - ఆధార్ లింక్ చేశారా? ఇంకా చేయ‌క‌పోతే ఇప్ప‌ట‌కీ కొంత జ‌రిమానాతో లింక్ చేసుకోవ‌చ్చు.

Updated : 06 Apr 2022 14:45 IST

పాన్ - ఆధార్ లింక్ చేశారా? ఇంకా చేయ‌క‌పోతే ఇప్ప‌టికీ కొంత జ‌రిమానాతో లింక్ చేసుకోవ‌చ్చు. పాన్‌, ఆధార్ అనుసంధాన గ‌డువు మార్చి 31తో ముగిసింది. అయిన‌ప్ప‌టికీ మరో ఏడాది పాటు అంటే.. మార్చి 2023 వ‌ర‌కు పాన్ కార్డు ప‌నిచేస్తుంద‌ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ తెలిపింది. ఆధార్‌తో అనుసంధానించ‌ని పాన్‌తో ఐటీఆర్ ఫైలింగ్‌, ప‌న్ను వాప‌సు క్లెయిమ్‌, ఇత‌ర ఐటీ ప‌నుల‌ను చేసుకోవ‌చ్చు. అయితే పాన్ - ఆధార్ లింక్ చేయకుండా చేస్తే జరిమానా వ‌ర్తిస్తుంది.

1. సీబీడీటీ తాజాగా విడుద‌ల చేసిన సర్క్యుల‌ర్ ప్ర‌కారం పాన్ - ఆధార్‌ను మార్చి 31, 2023 లోపు జరిమానా చెల్లించి లింక్ చేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత ఆధార్‌తో అనుసంధానించ‌ని పాన్ కార్డులు ప‌నిచేయ‌వు.

2. బ‌యోమెట్రిక్ ఆధార్‌తో పాన్‌ను జూన్ 30, 2022 లోపు రూ.500తో..ఆ త‌ర్వాత రూ.1000 జరిమానా చెల్లించి లింక్ చేసుకోవచ్చు.

3. పైన తెలిపిన నిర్ణీత తేదీ లోపు అనుసంధాన ప్ర‌క్రియ పూర్తి చేయ‌క‌పోతే నిర్దిష్ట వ్య‌క్తికి కేటాయించిన పాన్ ప‌నిచేయ‌దు.

4. ఆదాయపు పన్ను రూల్‌ 114ఏఏఏ ప్రకారం, ఒక వ్యక్తి పాన్ పని చేయని పక్షంలో, అవ‌సర‌మైన చోట్ల పాన్ అందించ‌లేరు. దీంతో ప‌లు ఇబ్బందులు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది.

5. ప‌నిచేయ‌ని పాన్‌తో రిట‌ర్నుల‌ను ఫైల్ చేయ‌డం సాధ్యం కాదు. అలాగే, పెండింగ్ ఉన్న‌ రిట‌ర్నుల‌ను ప్రాసెస్ చేయ‌డం కుదరదు. అదేవిధంగా, పెండింగ్‌లో ఉన్న రీఫండ్లను కూడా జారీ చేయ‌లేరు. అంతేకాకుండా అధిక రేట్ల‌తో ప‌న్ను విధిస్తారు.

6. ఆదాయ‌పు ప‌న్నుతో పాటు బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక లావాదేవీల విష‌యంలోనూ స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. అన్ని ఆర్థిక లావాదేవీల్లోనూ కేవైసీ పూర్తి చేసేందుకు కూడా పాన్ త‌ప్ప‌నిస‌రి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని