WhatsApp: వాట్సాప్‌లో ఆ మెసేజ్ ఎందుకు వస్తుందో తెలుసా?
వాట్సాప్ (WhatstApp)లో కొన్నిసార్లు అవతలి వారు మెసేజ్ పంపిన తర్వాత కూడా వెయిటింగ్ ఫర్ దిస్ మెసేజ్ అని కనిపిస్తుంటుంది. అసలు ఈ మెసేజ్ అర్థం ఏంటి? ఇది ఎందుకు కనిపిస్తుంది? ఈ మెసేజ్ గురించి వాట్సాప్ ఏం చెబుతుందో చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ (WhatsApp) యాప్‌లో అవతలి వ్యక్తి మెసేజ్ పంపిన తర్వాత కూడా కొన్నిసార్లు వెయిటింగ్ ఫర్ దిస్ మెసేజ్.. చెక్ యువర్ ఫోన్ (Waiting for this Message, Check Your Phone) అని మొబైల్ వెర్షన్‌తోపాటు డెస్క్‌టాప్/వెబ్ వెర్షన్లలో కనిపిస్తుంది. ఈ మెసేజ్ వెబ్ వాట్సాప్‌లో వచ్చిన వెంటనే ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయగానే అవతలి వ్యక్తి పంపిన మెసేజ్ కనిపిస్తుంది. ఇంతకీ ఆ మెసేజ్ అర్థం ఏంటి? దీనిపై వాట్సాప్ ఏం చెబుతుందో చూద్దాం.
వాట్సాప్‌లో అప్పుడప్పుడు కనిపించే ఈ మెసేజ్‌ను టెక్ నిపుణులు టెక్నికల్ ఎర్రర్ (Technical Error) అని చెబుతుంటే.. వాట్సాప్ మాత్రం అదేం పెద్ద సమస్య కాదని అంటోంది. అలానే, ప్రధానంగా మూడు కారణాల వల్ల ఈ సమస్య వస్తుందని చెబుతోంది. అవేంటంటే..
- మెసేజ్ పంపిన వ్యక్తి లేదా రిసీవ్ చేసుకున్న వ్యక్తి తమ ఫోన్లలో కొత్తగా వాట్సాప్ ఇన్‌స్టాల్ చేస్తే ‘వెయిటింగ్ ఫర్ ది మెసేజ్’ అని కనిపిస్తుందట. అలానే ఫోన్‌లో వాట్సాప్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్నా.. ‘వెయిటింగ్ ఫర్ దిస్ మెసేజ్.. చెక్ యువర్ ఫోన్’ అని చూపిస్తుందని వాట్సాప్ చెబుతోంది. ఒకవేళ మీరు వెబ్ వాట్సాప్ కనెక్ట్ చేసినప్పుడు.. ఫోన్ దానితో సింక్ కాకపోయినా ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుందట.
- టెక్ నిపుణులు మాత్రం ఈ ఎర్రర్ వెనుక అసలు కారణం వివరించారు. వాట్సాప్‌లో జరిగే సంభాషణలకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End-To-End Encryption) భద్రత ఉంటుంది. దీనివల్ల ఇద్దరి మధ్య చాట్‌లను మూడో వ్యక్తి చూడలేరు. అలా ప్రతి చాట్‌కి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కోసం వాట్సాప్ కొన్నిసెక్యూరిటీ కీలను ఉపయోగిస్తుంది. అయితే, యూజర్లు ఎవరైనా వాట్సాప్‌ను అన్-ఇన్‌స్టాల్ (Un-Install) చేసి రీ-ఇన్‌స్టాల్ (Re-Install) చేసినా, లేదా కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసినప్పుడు.. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కోసం సెక్యూరిటీ కీలను జనరేట్ చేసేందుకు వాట్సాప్‌కు కొంత సమయం పడుతుంది. ఆ సమయంలోనే ‘వెయిటింగ్ ఫర్ దిస్ మెసేజ్.. చెక్ యువర్ ఫోన్’ అని కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే, భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా.. వాట్సాప్ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడమే మేలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: ముంబయిలో సహజీవన భాగస్వామిని ముక్కలు చేసి..ఆపై కుక్కర్లో ఉడికించి..!
-
General News
Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
India News
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం