Risk Tolerance: రిస్క్ ఎంతవరకు తీసుకోగలరు? తెలుసుకోండి..
మదుపర్లు పెట్టుబడులను ఎంచుకునేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాల్లో రిస్క్ తీసుకునే సామర్థ్యం ముఖ్యమైనది.
ఇంటర్నెట్‌డెస్క్: పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరైనా లాభాలనే కోరుకుంటారు. నష్టం అనే మాటను ఏమాత్రం ఇష్టపడరు. కానీ పెట్టుబడుల్లో ప్రతిసారీ లాభం వస్తుందని చెప్పలేం. ఒక్కోసారి నష్టం కూడా రావచ్చు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు మదుపర్లు ఎంత వరకు రిస్క్ తీసుకోగలరో తెలుసుకోవాలి.
రిస్క్ టాలరెన్స్ అంటే..
పెట్టుబడుల గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు.. మదుపర్లు ఎంత వరకు నష్టాన్ని తట్టుకోగలరు అనే దాన్ని నష్టభయాన్ని భరించే సామర్థ్యం (రిస్క్ టాలరెన్స్) అంటారు. దీన్ని తెలుసుకున్నాక ఎందులో పెట్టుబడులు పెట్టాలో నిర్ణయించుకోగలుగుతారు.
నష్టభయ సామర్థ్యం ఎలా తెలుసుకోవాలి?
ఆదాయ స్థిరత్వం: ఆదాయ స్థిరత్వం ఏర్పడినప్పుడు రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం. స్థిర ఆదాయంలేని వారు రిస్క్ తగ్గించుకుంటూ కొంత మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల కోసం పొదుపు చేయడం మంచిది. శాలరీతో పాటు మీకు ఇంటి అద్దె, ఇతర ఆదాయాలు ఉన్నప్పుడు స్వల్పకాలంలో రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో మంచి రాబడి అందించే పథకాలను ఎంచుకోవచ్చు.
వయసు: పెట్టుబడుల్లో అత్యంత ముఖ్యమైన అంశం సమయం. యువకులకు తగినంత సమయం ఉంటుంది కాబట్టి కొంత మేరకు రిస్క్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రారంభంలో ఈక్విటీల్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతూ సమయం గడిచే కొద్దీ ఈ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. వృద్ధులు నష్టభయం లేని పథకాలను ఎంచుకోవడం మేలు.
ఆధారిత సభ్యులు: ఒక్కోసారి రిస్క్ తీసుకోగల సామర్థ్యం ఆధారిత కుటుంబ సభ్యులను బట్టి మారుతుంటుంది. కుటుంబంలో ఒక్కరు మాత్రమే సంపాదించే వ్యక్తి ఉండి, ఆధారపడిన వారు ఎక్కువగా ఉంటే ఎక్కువ రిస్క్ తీసుకోకపోవడం మేలు. ఇంటి బాధ్యతలు ఎక్కువగా లేని వారు రిస్క్ ఎక్కువ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
లక్ష్యాలు, అందుకు ఉన్న సమయం: ఆర్థిక లక్ష్యాలు అందరికీ ఒకేలా ఉండవు. వ్యక్తిగత లక్ష్యాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టాలి. సాధారణంగా లక్ష్యం చేరుకునేందుకు ఎక్కువ సమయం ఉంటే ఎక్కువ రిస్క్ ఉన్న పథకాలను ఎంచుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యం కోసం 15 ఏళ్లు సమయం ఉన్న వ్యక్తులు, 5 ఏళ్ల సమయం ఉన్న వ్యక్తులు ఒకే రకమైన రిస్క్‌ను తీసుకోలేరు. ఉదాహరణకు మీరు కనీసం 8-10 ఏళ్ల పాటు పెట్టుబడులు పెట్టగలిగితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. అదే స్వల్పకాలం కోసం అయితే బ్యాంకు రికరింగ్ డిపాజిట్లను ఎంచుకోవచ్చు.
పెట్టుబడిదారుని ఆలోచనా విధానం: కొంత మంది పెట్టుబడిదారులు నష్టాన్ని ఏ మాత్రం తీసుకోలేరు. నష్టపోతున్నాం అనిపిస్తే వెంటనే డబ్బు వెనక్కి తీసుకుంటారు. లాభం వస్తుందనుకుంటే వెంట వెంటనే పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. ఇలాంటి ఆలోచనా విధానం వల్ల నష్టపోయే అవకాశాలే ఎక్కువ. ఉదాహరణకు స్టాక్ మార్కెట్లను తీసుకుంటే స్వల్పకాలంలో ఒడుదొడుకులకు లోనవుతూ ఉంటాయి. మార్కెట్లు పడిపోయిన వెంటనే నిధులను విత్‌డ్రా చేసుకుంటే పెట్టుబడి కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
చివరిగా..
మీరు ఎంతవరకు రిస్క్‌తీసుకోగలరో తెలుసుకున్నాకే పెట్టుబడులను ఎంపిక చేసుకోవాలి. లేదంటే మీ పోర్ట్‌ఫోలియో అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్