SBI Balance: ఎస్‌బీఐ ఖాతా బ్యాలెన్స్‌.. సులువుగా తెలుసుకుందామిలా..

SBI Balance: ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్‌లైన్‌ సేవలను అందిస్తోంది. అకౌంట్‌లో బ్యాలెన్స్‌ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Updated : 22 Jun 2024 14:30 IST

SBI Balance | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖాతాదారులకు కావాల్సిన సమాచారాన్ని వేగంగా అందించేందుకు ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)’ పలు ఆన్‌లైన్‌ సేవలను అందిస్తోంది. దీంతో క్యూలైన్లలో గంటలతరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలుసుకోవడానికి కూడా లైన్లలో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని క్లిక్కులలోనే సమాచారమంతా కస్టమర్ల ముందుంటుంది. ఎస్‌బీఐ ఖాతాలో బ్యాలెన్స్‌ (SBI Account Balance) తెలుసుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. ఎసెమ్మెస్‌, ఆన్‌లైన్‌, వాట్సప్‌ ఇలా వివిధ మాధ్యమాలను ఉపయోగించి ఆ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

మిస్డ్‌ కాల్‌ బ్యాంకింగ్‌..

మిస్డ్‌ కాల్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌ ద్వారా ఎస్‌బీఐ (SBI) ఖాతాలో ఉన్న సొమ్మెంతో తెలుసుకోవచ్చు. అయితే, ఈ సేవలను పొందడానికి ముందే రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అదెలాగో చూద్దాం..

  • ఫోన్‌లో మెసేజ్‌ యాప్‌ తెరవాలి.
  • REG ఖాతా నెంబర్‌ టైప్‌ చేయాలి.
  • 09223488888కు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి సందేశం పంపాలి.

దీంతో మీ ఎస్‌బీఐ మిస్డ్‌ కాల్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఇప్పుడు బ్యాంకు మీకు రెండు ప్రత్యామ్నాయాలను అందిస్తుంది. బ్యాలెన్స్‌ చెక్ చేసుకోవడానికి, మినీ స్టేట్‌మెంట్‌ కోసం రెండు వేర్వేరు టోల్‌ఫ్రీ నెంబర్లను అందిస్తుంది.

9223766666: ఎస్‌బీఐ బ్యాలెన్స్‌ తెలుసుకోవడానికి.

9223866666: ఎస్‌బీఐ ఖాతా ద్వారా చేసిన చివరి ఐదు లావాదేవీల సమాచారం కోసం.

వాట్సప్‌ ద్వారా..

వాట్సప్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ కింద ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల సమాచారాన్ని అందిస్తోంది. ఈ మాధ్యమం ద్వారా బ్యాలెన్స్‌ కూడా తెలుసుకోవచ్చు.

  • +919022690226 నెంబర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలి.
  • వాట్సప్‌లో పై నెంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ చేయాలి.
  • కనిపించే వివిధ రకాల ఆప్షన్లలో ‘గెట్‌ బ్యాలెన్స్‌’పై క్లిక్‌ చేయాలి.
  • కావాల్సిన సమాచారం మీ ముందుంటుంది.

ఎస్‌బీఐ వాట్సప్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ ద్వారా మినీ స్టేట్‌మెంట్స్‌, అకౌంట్‌ స్టేట్‌మెంట్స్‌, పెన్షన్‌ స్లిప్స్‌, లోన్లు, ఎన్‌ఆర్‌ఐ ఖాతాలకు సంబంధించిన సమాచారం సహా సేవలను పొందొచ్చు.

ఎస్సెమ్మెస్‌తో..

  • మెసేజ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
  • BAL అని టైప్‌ చేయాలి.
  • రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి +919223766666కు మెసేజ్‌ పంపాలి.
  • దీంతో మీ ఎస్‌బీఐ ఖాతాలోని బ్యాలెన్స్‌ ఎంతో తెలుసుకోవచ్చు. MSTMT అని పంపి మినీ స్టేట్‌మెంట్‌ను కూడా పొందొచ్చు.

యోనో యాప్‌తో..

ఎస్‌బీఐ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి యోనో ఓ సులువైన మార్గం. ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. దీనిద్వారా చాలారకాల బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. బ్యాలెన్స్‌ ఎలా చూడాలో చూద్దాం..

  • మొబైల్‌లో యోనో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేయాలి.
  • యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి.
  • తొలిసారి వాడడానికి ముందు పిన్‌ లేదా బయోమెట్రిక్‌ ద్వారా ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.
  • పూర్తయిన తర్వాత హోమ్‌ స్క్రీన్‌పై ‘వ్యూ బ్యాలెన్స్‌’ కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్‌ చేస్తే ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలిసిపోతుంది.

నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా..

  • డెస్క్‌టాప్‌ లేదా మొబైల్‌ బ్రౌజర్‌లో https://www.onlinesbi.sbi/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • పర్సనల్‌ బ్యాంకింగ్‌లోని లాగిన్‌పై క్లిక్‌ చేయాలి.
  • యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి లాగిన్‌ కావాలి.
  • రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాలి.
  • ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • ట్రాన్సాక్షన్స్‌ అకౌంట్స్‌ విభాగంలోని అకౌంట్‌ సమ్మరీ సెక్షన్‌లోకి వెళ్లాలి. క్లిక్‌ హియర్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఎస్‌బీఐ ఖాతాలోని బ్యాలెన్స్‌ కనిపిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని