EPFO: యూఏఎన్‌ నంబరు గుర్తులేదా? ఇలా తెలుసుకోవచ్చు..

ఈపీఎఫ్‌ఓ సభ్యులు యూఏఎన్‌ నంబరును ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు

Updated : 10 Jan 2023 10:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈపీఎఫ్‌ (EPF) ఖాతాదారులకు యూఏఎన్‌ నంబరు (UAN Number) కీలకమైనది. ఇది ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) తమ సభ్యులకు కేటాయించే 12 అంకెల సంఖ్య. దీని ద్వారా సభ్యులు ఆన్‌లైన్ ద్వారా ఈపీఎఫ్‌ ఖాతాకు సులభంగా లాగిన్‌ అయ్యి.. పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్‌/ ప్రింట్‌ చేసుకోవచ్చు. అలాగే, యూఏఎన్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా వ్యక్తిగత వివరాలను, కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. రెండు ఈపీఎఫ్‌ ఖాతాలను విలీనం చేసుకోవచ్చు. అలాగే, ఆన్‌లైన్‌ ద్వారానే క్లెయింలు చేసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలను అందించే యూఏఎన్ నంబరు మీ వద్ద లేకపోతే తిరిగి పొందవచ్చు. అయితే, యూఏఎన్‌ నంబర్‌ యాక్టివ్‌గా ఉండాలి. అలాగే, మొబైల్‌ నంబరుతో అనుసంధానమై ఉండాలి.

ఆన్‌లైన్‌ ద్వారా..

  • ఈపీఎఫ్‌ఓ సభ్యుడు epfindia.gov.in పోర్టల్‌ను సందర్శించడం ద్వారా యూఏఎన్‌ను సులభంగా తెలుసుకోవచ్చు.
  • ముందుగా ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో ‘సర్వీసెస్‌’ సెక్షన్‌కు వెళ్లాలి.
  • ఇక్కడ ‘ఫర్‌ ఎంప్లాయీస్‌’ పై క్లిక్‌ చేసి ‘యూఏఎన్‌ సభ్యుడు/ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (OCS/OTCP)’ పై క్లిక్‌ చేయాలి. 
  • ఇప్పుడు మీరు unifiedportal-mem.epfindia.gov.in పోర్టల్‌కు రీడైరెక్ట్‌ అవుతారు. ఇక్కడ ‘ఇంపార్టెంట్‌ లింక్స్‌’లో అందుబాటులో ఉన్న ‘నో యువర్‌ యూఏఎన్‌’ పై క్లిక్‌ చేయాలి. లేదా ఇక్కడ ఉన్న లింక్‌పై క్లిక్‌ చేసి నేరుగా ఈ పేజీకి వెళ్లొచ్చు.
  • ఇప్పుడు మీరు మీ మొబైల్‌ నంబర్‌, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి రిక్వెస్ట్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు మీ యూఏఎన్‌ నంబర్‌కు లింక్‌ అయ్యి ఉన్న మొబైల్‌ నంబరుకు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది. దీన్ని ఎంటర్‌ చేస్తే మీ యూఏఎన్‌ నంబర్‌  ఎస్సెమ్మెస్‌ ద్వారా వస్తుంది. 

ఆఫ్‌లైన్‌ ద్వారా

ఎస్ఎంఎస్‌: యూఏఎన్‌ యాక్టివ్‌గా ఉన్న సభ్యులు తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరు నుంచి 77382 99899కు ఎస్సెమ్మెస్‌ పంపడం ద్వారా యూఏఎన్‌ నంబరు, ఖాతా బ్యాలెన్స్‌ వంటి వివరాలను పొందొచ్చు. ఆంగ్లంతో పాటు తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆంగ్లంలో ఎస్సెమ్మెస్‌ పొందేందుకు EPFOHO UAN అనిటైప్‌ చేసి 77382 99899కి ఎస్సెమ్మెస్‌ చేయాలి. ఒకవేళ ప్రాంతీయ భాషల్లో పొందాలంటే ఆ భాషకు సంబంధించి తొలి మూడు అక్షరాలు కూడా టైప్‌ చేయాలి. ఉదాహరణకు తెలుగులో వివరాలు పొందాలంటే EPFOHO UAN TEL అని టైప్‌ చేసి 77382 99899కు ఎస్సెమ్మెస్‌ చేయాలి.  ఇలా ఎస్‌ఎంఎస్‌ పంపితే.. ఈపీఎఫ్‌ఓ చివరి కాంట్రీబ్యూషన్‌తో పాటు బ్యాలెన్స్‌, యూఏఎన్‌ నంబరు, పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వంటి వివరాలతో ఈపీఎఫ్‌ఓ నుంచి ఎస్సెమ్మెస్‌ వస్తుంది.

మిస్డ్‌ కాల్‌: ఈపీఎఫ్‌ఓ సభ్యులు తమ రిజిస్టర్‌ మొబైల్‌ నంబరు నుంచి 99660 44425 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా కూడా ఈ వివరాలు పొందవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని