FD Rates: వడ్డీ రేట్లను పెంచిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

సీనియర్‌ సిటిజన్లు సాధారణ డిపాజిటర్ల వడ్డీ రేటు కన్నా 0.50% అధిక వడ్డీ రేటు పొందుతారు.

Updated : 20 Oct 2022 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రైవేటు రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10-25 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు అక్టోబరు 19 నుంచి అమల్లోకి వస్తాయి. 7 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై 2.50% నుంచి 6.00% వరకు వడ్డీ రేట్లను బ్యాంకు అందిస్తుంది. 1 సంవత్సరం 25 రోజుల నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై 6.10-6.20% వరకు వడ్డీ లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లు అన్ని కాల పరిమితుల డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్ల వడ్డీ రేటు కన్నా 0.50% అధిక వడ్డీ రేటు పొందుతారు. వీరు కనిష్ఠ వడ్డీ రేటు 3.00% నుంచి గరిష్ఠంగా 6.70% వరకు ఉంది. ఈ వడ్డీ రేట్లు రూ. 2 కోట్ల వరకు డిపాజిట్లకు వర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని