Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన కోటక్‌ మహీంద్రా

కోటక్‌ మహీంద్రా బ్యాంకు తన ఎఫ్‌డీలపై 50 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. పెంచిన రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయి.

Published : 08 Mar 2023 18:18 IST

దిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంక్‌ కోటక్‌ మహీంద్రా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. ఈ బ్యాంకులో 7-14 రోజుల కాలవ్యవధికి సాధారణ డిపాజిటర్లకు 2.75%, సీనియర్‌ సిటిజన్లకు 3.25% కనీస వడ్డీ రేటుగా బ్యాంకు నిర్ణయించింది. ఒక సంవత్సరం డిపాజిట్‌కు సాధారణ డిపాజిటర్లకు 7%, సీనియర్‌ సిటిజన్లకు 7.50%గా నిర్ణయించింది. 390 రోజుల నుంచి 2 సంవత్సరాల కాలవ్యవధి గల సాధారణ డిపాజిటర్లు గరిష్ఠంగా 7.20% వడ్డీని పొందుతారు. ఇదే కాలవ్యవధికి సీనియర్‌ సిటిజన్లు 7.70% వడ్డీ పొందుతారు. ఈ బ్యాంకులో కనీస ఎఫ్‌డీ రూ.5,000. పెంచిన వడ్డీ రేట్లు 2023 మార్చి 8 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని