Elon Musk: ఇలాంటి బాధ మరెవరికీ రావొద్దు: ఎలాన్‌ మస్క్‌

ఆర్థిక కష్టాల్లో ఉన్న ట్విటర్‌ (Twitter)ను దివాలా ముప్పు నుంచి బయటపడేసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తెలిపారు.

Published : 06 Feb 2023 10:22 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆ సంస్థను గట్టెక్కించడంపైనే దృష్టిని కేంద్రీకరించారు. మరోవైపు ఆయన నేతృత్వంలోని మరో రెండు కీలక సంస్థలు టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు నెలలు ‘‘చాలా కఠినంగా’’ గడిచాయని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్విటర్‌ (Twitter)ను దివాలా ముప్పు నుంచి రక్షించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందంటూ ఆదివారం ట్వీట్‌ చేశారు.

‘‘గత మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయి. ట్విటర్‌ (Twitter)ను దివాలా నుంచి రక్షించడం కోసమే శ్రమించాల్సి వచ్చింది. మరోవైపు టెస్లా, స్పేస్‌ఎక్స్‌లో కీలక బాధ్యతల్నీ చక్కబెట్టాను. ఇలాంటి బాధ మరొకరికి రావొద్దని ఆశిస్తున్నాను. ట్విటర్‌ (Twitter)లో ఇంకా సవాళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రజల నుంచి లభించిన మద్దతు అభినందనీయం’’ అని మస్క్‌ (Elon Musk) ట్వీట్‌ చేశారు.

గత అక్టోబర్‌లో మస్క్‌ (Elon Musk) ట్విటర్‌ (Twitter) కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆదాయం గణనీయంగా పడిపోయింది. వాణిజ్య ప్రకటనలు తగ్గిపోవడమే అందుకు కారణం. దీంతో ట్విటర్‌ (Twitter)ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మస్క్‌ (Elon Musk) అనేక చర్యలు చేపట్టారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించారు. ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించారు. ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలు, వసతులను కుదించారు. విలువైన వస్తువులను వేలం వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని