ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేయలేదా? ఇదే లాస్ట్‌ ఛాన్స్‌!

ITR Filing: గడిచిన ఆర్థిక  సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడం మర్చిపోయారా? అయితే మీకిదే ఇంకో అవకాశం ఉంది. డిసెంబర్‌ 31లోపు ఆ పని పూర్తి చేయండి..

Published : 23 Dec 2022 12:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక సంవత్సరం 2021-22కు సంబంధించి ఆదాయ పన్ను రిటర్నులు ఫైల్ (ITR Filing) చేయడానికి ఆఖరు తేదీ ఈ ఏడాది జులై 31. అయితే, ఇప్పటి వరకు కూడా రిటర్నులు ఫైల్ చేయని వారు చాలా మందే ఉన్నారు. మరి వీరు ఇప్పుడు ఐటీఆర్ (ITR) ఫైల్  చేసే అవకాశం ఉంటుందా? ఉంటే ఎలా చేయాలి? ఇప్పుడు చూద్దాం..

ఎప్పటి వరకు చేయొచ్చు?

గత ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీఆర్ ఫైల్ చేయని వారు ‘బిలేటెడ్ ఐటీఆర్’ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఆఖరు తేదీ 2022, డిసెంబర్ 31. అలాగే, ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన వారు అందులో ఏవైనా తప్పులుంటే ఈ తేదీలోపు తిరిగి రివైజ్డ్‌ రిటర్న్ ఫైల్ చేసి సరిదిద్దుకోవచ్చు.

ఎలా చేయొచ్చు?

బిలేటెడ్ ఐటీఆర్, సాధారణ రిటర్నుల్లాగనే ఉంటుంది. అయితే, ఫైల్ చేసే సమయంలో సెక్షన్ 139(4) సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే, ఏవైనా పెనాల్టీ, ఛార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటే వెంటనే చెల్లించాలి. రూ.5 లక్షల వరకు ఆదాయం గల వారు రూ.1000 వరకు పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. ఇతరులకు ఇది రూ.5000 వరకు ఉంటుంది.

చివరిగా: రిటర్నులు ఫైల్ చేశాఖ 30 రోజుల్లోపు ఇ-వెరిఫై చేయడం మర్చిపోవద్దు. వెరిఫై చేయని రిటర్నులు ప్రాసెస్ చేయరు. ఇప్పటి వరకు ఫైల్ చేయని వారు లేదా ఫైల్ చేసిన రిటర్నుల్లో తప్పులు చేసిన వారు పైన తెలిపిన తేదీలోపు ఫైల్ చేసి జాగ్రత్త పడొచ్చు. లేదంటే, ఆ తరవాత నోటీసులు పొందే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని