PAN- Aadhaar: పాన్- ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు
PAN-Aadhaar Link: పాన్-ఆధార్ అనుసంధానానికి కేంద్రం గడువు పెంచింది. మరో మూడు నెలల పాటు అనుసంధానానికి అవకాశం ఇచ్చింది.
PAN-Aadhaar Link | దిల్లీ: పాన్- ఆధార్ (PAN - AAdhaar) అనుసంధానానికి గడువును కేంద్రం పొడిగించింది. మార్చి 31తో గడువు ముగియాల్సి ఉండగా.. మరో మూడు నెలలు పెంచుతూ జూన్ 30 వరకు అనుసంధానానికి అవకాశం ఇచ్చింది. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తెలియజేసింది. నిర్దేశిత గడువులోగా పాన్- ఆధార్ అనుసంధానం పూర్తి చేయకుంటే జులై 1 నుంచి పాన్ నిరుపయోగంగా మారనుంది.
Also Read: పాన్- ఆధార్ లింక్.. ఎలా చేయాలి?
పాన్ కార్డు (Pan Card) ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో (Aadhaar) అనుసంధానం చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. రూ.1000 అపరాధ రుసుముతో మార్చి 31లోపు అనుసంధానానికి చివరి అవకాశం ఇచ్చింది. తాజాగా ఆ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. చెల్లుబాటులో లేని పాన్‌తో బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ఖాతాల్లాంటివి తెరవలేరు. మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకూ నిబంధనలు అడ్డువస్తాయి. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు. ఇప్పటికే 51 కోట్ల పాన్‌లు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయని సీబీడీటీ పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
World News
2000 Notes: గల్ఫ్‌లోని భారతీయులకు రూ.2000 నోట్ల కష్టాలు
-
General News
CM Kcr: కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం.. రెండ్రోజుల్లో విధివిధానాలు: సీఎం కేసీఆర్
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. మరో నలుగురు అరెస్టు